AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు చెక్ పెట్టే సూపర్ మెడిసిన్!

భారతీయ సాంప్రదాయ వైద్యంలో వేప ఆకుకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. వేప ఆకులు, బెరడు, వేప నూనె వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనకు తెలుసు. కానీ, చాలామంది వేప చెట్టుకు కాసే పండ్లను పెద్దగా పట్టించుకోరు. నిజానికి వేప ఆకుల కంటే ఈ పండ్లలో ఔషధ గుణాలు చాలా ఎక్కువ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం వేప పండ్లను క్రమం తప్పకుండా వాడటం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

Jyothi Gadda
|

Updated on: Jun 10, 2026 | 8:11 AM

Share
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: వేప పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని (Immunity) బలోపేతం చేసి, సీజనల్ వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతాయి.

1 / 6
జ్వరాల నుండి ఉపశమనం: మలేరియా, డెంగ్యూ లేదా సాధారణ వైరల్ జ్వరాలు వచ్చినప్పుడు వేప పండ్ల రసం లేదా పొడిని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది. ఇది శరీరంలోని హానికరమైన టాక్సిన్లను బయటకు పంపడానికి సహాయపడుతుంది.

2 / 6
మధుమేహం, కంటి ఆరోగ్యానికి మేలు: డయాబెటిస్ ఉన్న రోగులకు వేప పండ్లు ఒక వరమనే చెప్పాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను (Blood Sugar Levels) నియంత్రణలో ఉంచడానికి ఎంతగానో తోడ్పడతాయి. అలాగే, వయసు పెరగడం వల్ల వచ్చే కంటి సమస్యలను నివారించడంలో వేప పండ్లు సహాయపడతాయి. వీటిలో ఉండే పోషకాలు కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, కంటి ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి.

3 / 6
చర్మ, జుట్టు సంరక్షణ: చర్మంపై వచ్చే మొటిమలు, మచ్చలు, సోరియాసిస్, ఎగ్జిమా వంటి సమస్యలకు వేప పండ్ల గుజ్జు మంచి మందుగా పనిచేస్తుంది. అలాగే, తలలో పేలు, చుండ్రు సమస్య ఉన్నవారు ఈ పండ్ల రసాన్ని కుదుళ్లకు పట్టించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరుగుతుంది.

4 / 6
కిడ్నీ, లివర్ ఆరోగ్యం: శరీరంలోని అంతర్గత అవయవాలను శుభ్రపరచడంలో వేప పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు, కిడ్నీలు, కాలేయం (Liver) లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి వాటి పనితీరును మెరుగుపరుస్తాయి.

5 / 6
ఎలా ఉపయోగించాలి?: వేప పండ్లు పండినప్పుడు అవి కాస్త తీపి, చేదు కలయికతో ఉంటాయి. వీటిని నేరుగా తినవచ్చు లేదా ఎండబెట్టి పొడిలా చేసుకుని నీటిలో కలుపుకుని తాగవచ్చు. అయితే, వీటిని పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన ఔషధ గనుల్లో వేప పండు ఒకటి. చేదుగా ఉందని పక్కన పెట్టకుండా, నిపుణుల సలహాతో దీనిని దినచర్యలో భాగం చేసుకుంటే ఎన్నో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు.

6 / 6
Follow Us