AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharathiraja: లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినిమా ఇండస్ట్రీ

ప్రముఖ తమిళ సీనియర్ దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీరాజా (86) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం (జూన్ 10) తెల్లవారుజామున తుదిశ్వాసవిడిచారు. భారతీరాజా మృతితో ఆయన కుటుంబ సభ్యులు, సినీ అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Bharathiraja: లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినిమా ఇండస్ట్రీ
Legendary Tamil Director Bharathiraja
Basha Shek
|

Updated on: Jun 10, 2026 | 9:44 AM

Share

సినిమా ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీ రాజా (84) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బుధవారం (జూన్ 10) తెల్లవారుజామున భారతీరాజా తుదిశ్వాసవిడిచారు. లెజెండరీ డైరెక్టర్‌ మరణ వార్త తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 1977లో వచ్చిన తమిళ మూవీ ‘16 వయథినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు) తో దర్శకుడిగా మారారు భారతీరాజా. ఆ తర్వాత ‘కిళక్కే పోగుమ్ రైలు’, ‘సిగప్పు రోజాక్కల్’, ‘అలైగల్ ఒయివతిల్లై’, ‘కాదల్ ఓవియం’, ‘ముదల్ మరియాతై’ తదితర సూపర్ హిట్ సినిమాలను తమిళ ఆడియెన్స్ కు అందించారు. తెలుగులోనూ పలు క్లాసిక్ సినిమాలను తెరకెక్కించారీ లెజెండరీ డైరెక్టర్. ‘సీతాకోక చిలుక’, ‘ఆరాధన’, ‘జమదగ్ని’, ‘ఈతరం ఇల్లాలు’, ‘ఎర్ర గులాబీలు’, ‘టిక్ టిక్ టిక్’, ‘కొత్త జీవితాలు’, ‘యువతరం పిలిచింది’ ఇలా ఎన్నో మంచి సినిమాలను తెలుగు ఆడియెన్స్ కు అందించారు భారతీరాజా

కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడిగా, నిర్మాతగానూ సత్తా చాటారు భారతీ రాజా. ‘యువ’, ‘సీత కత్తి’, ‘ఈశ్వరన్‌’, ‘సర్‌’, ‘తిరు’, ‘మహారాజా’ వంటి చిత్రాల్లో ఈ దర్శకుడు కీలక పాత్రలు పోషించారు. ఇక చివరిగా ‘మీండుమ్ ఒరు మరియాదై’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు భారతీరాజా. 2020లో రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. దీని తర్వాత ఆయన మెగా ఫోన్ పట్టలేదు. కేవలం నటుడిగా మాత్రమే చేశారు. ఇక మోహన్ లాల్ నటించిన తుడురమ్ సినిమాలోనే చివరిసారిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు భారతీరాజా.

ఇవి కూడా చదవండి

కుంగదీసిన కుమారుడి మరణం..

కాగా గతేడాది భారతీరాజా ఏకైక కుమారుడు మనోజ్ భారతీరాజా కన్నుమూశాడు. నటుడు, దర్శకుడిగా ఎదుగుతున్న సమయంలోనే కుమారుడు ఆకస్మికంగా కన్నుమూయడం భారతీరాజాను బాగా క్రుంగదీసింది.  ఈ విషాదం నుంచి కోలుకోవడానికి ఆయనకు చాలా కాలం పట్టింది. ఈ విషాదాన్ని మర్చిపోవడానికి కొంతకాలం కుటుంబ సభ్యుల వద్ద విదేశాల్లో గడిపిన భారతీరాజా, అనంతరం చెన్నైకి తిరిగివచ్చారు.

సినీ ప్రముఖుల సంతాపం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మళ్లీ పెరిగిన CNG ధరలు
మళ్లీ పెరిగిన CNG ధరలు
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. గుడ్డు ఉడికించేటప్పుడు ఇది..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. గుడ్డు ఉడికించేటప్పుడు ఇది..
ఉదయాన్నే నానబెట్టిన నల్ల కిస్‌మిస్ తింటున్నారా? ఆరోగ్య ప్రయోజనాలు
ఉదయాన్నే నానబెట్టిన నల్ల కిస్‌మిస్ తింటున్నారా? ఆరోగ్య ప్రయోజనాలు
'ఇరుముడి' సినిమాకు జబర్దస్త్ కొమరక్క రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
'ఇరుముడి' సినిమాకు జబర్దస్త్ కొమరక్క రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఏమన్నా కాంబినేషనా.. స్వ్కాడ్ చూస్తేనే సుస్సు పోసుకుంటారంతే..
ఏమన్నా కాంబినేషనా.. స్వ్కాడ్ చూస్తేనే సుస్సు పోసుకుంటారంతే..
మీకు తెలుసా? ఐశ్వర్య ఏటా ఈ టాలీవుడ్ స్టార్ నటుడికి రాఖీ కడుతుందట
మీకు తెలుసా? ఐశ్వర్య ఏటా ఈ టాలీవుడ్ స్టార్ నటుడికి రాఖీ కడుతుందట
ప్రేమకథ చిత్రం హీరోయిన్ ఏమైపోయింది..!
ప్రేమకథ చిత్రం హీరోయిన్ ఏమైపోయింది..!
డిస్‌ప్లే, ఫీచర్లతోనే పిచ్చెక్కిస్తున్న ఇన్ఫినిక్స్‌ హాట్‌ 70ప్రో
డిస్‌ప్లే, ఫీచర్లతోనే పిచ్చెక్కిస్తున్న ఇన్ఫినిక్స్‌ హాట్‌ 70ప్రో
సెప్టెంబర్ 1 నుంచి రానున్న మార్పులు ఇవే.. అన్నీ మారబోతున్నాయ్..
సెప్టెంబర్ 1 నుంచి రానున్న మార్పులు ఇవే.. అన్నీ మారబోతున్నాయ్..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో