Jayam Ravi: మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే కలిసిపోయారా? మళ్లీ జంటగా కనిపించిన జయం రవి, కెనీషా.. వీడియో
కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ ( జయం రవి ), ఆయన భార్య ఆర్తి రవిల విడాకుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ, దుమ్మెత్తిపోసుకుంటూ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు రవి- ఆర్తి.

గతేడాది నుంచి విడాకుల వివాదంతో వార్తల్లో నిలుస్తున్నాడు కోలవుడ్ స్టార్ హీరో జయం రవి అలియాస్ రవి మోహన్. తన భార్య వేధింపులతో విసిగిపోయానని, విడాకులు కావాల్సిందేనంటూ తెగేసి చెబుతున్నాడీ హీరో. కొన్ని రోజుల క్రితం ఇదే విషయంపై ప్రెస్ మీట్ పెట్టిన రవి విడాకులు మంజురయ్యే వరకు సినిమాల్లో నటించని ప్రకటన కూడా చేశాడు. ఆర్తితో పెళ్లి తర్వాత నరకం చూశానని, మొదటి రోజు నుంచే బ్లాక్ మెయిల్ చేశారని, ఆఖరికి నేను సంపాదించుకున్న డబ్బుని దాచుకోవడానికి కూడా ఒక అకౌంట్ లేకుండా చేశారని అందరి ముందు భోరుమని ఏడ్చాడు రవి. మరోవైపు రవితో ప్రేమలో ఉన్న సింగర్ కెనీషా కూడా అతనికి షాకిచ్చింది. రవితో తనకున్న రిలేషన్‌కి బ్రేకప్ చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సోషల్ మీడియా ట్రోలింగ్స్ వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, అందుకే చెన్నై నగరాన్ని సైతం వదిలి వెళ్లిపోతున్నట్లు ఆమె తెలిపంది. ఇది జరిగి కొన్ని రోజులు కూడా కాలేదు. తాజాగా మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది కెనీషా. ఉన్నట్లుండి జయం రవితో కలిసి తిరుమలలో కనిపించింది. వీరిద్దరూ కలిసి శ్రీవారి దర్శనానికి వెళుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వీరిద్దరు మళ్లీ కలిసిపోయారని నెట్టింట టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ వీడియో కొత్తదా? పాతదా? అన్నది క్లారిటీ రావడం లేదు. ఎందుకంటే గతంలో పలు మార్లు తిరుమలకు జంటగ వచ్చారు రవి- కెనీషా. మరోవైపు ఆర్తితో విడాకులు వచ్చేంత వరకు సినిమాల్లో నటించనని ప్రకటించిన రవి ఇటీవలే ఓ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లోకేశ్ కనగరాజ్ మూవీలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
మరోవైపు జయం రవి , ఆయన భార్య ఆర్తి రవిల మధ్య జరుగుతున్న విడాకుల వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆర్తి దాఖలు చేసిన తాత్కాలిక భరణం కేసులో కుటుంబ సంక్షేమ కోర్టుకు మరికొంత సమయం ఇవ్వాలంటూ జయం రవి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం (జూన్ 09) కొట్టివేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారమే రెండు వారాల వ్యవధిలోనే ఫ్యామిలీ కోర్టు ఈ భరణం పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.
తిరుమలలో జంటగా జయం రవి, కెనీషా.. వీడియో ఇదిగో..
Ravi Mohan and Kenisha reunite after separation! pic.twitter.com/xjT0mYi6ip
— Princy (@Mrking1618) June 9, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




