AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరిటాల రవి చెప్పిన ఆ మాటనే ‘సమరసింహారెడ్డి’లో డైలాగ్‌గా పెట్టేశా: ఆసక్తికర విషయం చెప్పిన పరుచూరి

నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు (జూన్ 10) ను పురస్కరించుకుని బుధవారం ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సమరసంహారెడ్డి మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ సినిమా గురించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఓ ఆసక్తికర విషయాన్ని బయట పెట్టారు.

పరిటాల రవి చెప్పిన ఆ మాటనే 'సమరసింహారెడ్డి'లో డైలాగ్‌గా పెట్టేశా: ఆసక్తికర విషయం చెప్పిన పరుచూరి
Samarasimha Reddy
Basha Shek
|

Updated on: Jun 10, 2026 | 6:51 AM

Share

ఇవాళ (జూన్ 10) నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు. దీంతో బాలయ్య బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు, నందమూరి అభిమానులు, నెటిజన్లు బాలయ్యకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక బాలకృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సమరసింహారెడ్డి మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. బుధవారం నుంచి ఎంపిక చేసిన థియేటర్లలో ఈ సినిమా 4K వెర్షన్ ను ప్రదర్శించనున్నారు. అయితే సమరసింహారెడ్డి సినిమా గురించి ప్రముఖ రచయిత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అదేంటంటే.. దివంగత పరిటాల రవి చెప్పిన ఓ మాట తనకు చాలా నచ్చి సమరసింహారెడ్డిలో సీన్లు రాసి, డైలాగ్‌‌లు పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

పరిటాల రవి తండ్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘శ్రీరాములయ్య’. మోహన్ బాబు ఇందులో కథానాయకుడిగా నటించారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథ, మాటలు అందించారు. ఈ సినిమా చర్చల సందర్భంగా పరిటాల రవిని కలిసినప్పుడు జరిగిన ఓ సంఘటనను పరుచూరి గుర్తు చేసుకున్నారు. ‘శ్రీరాములయ్య సినిమా గురించి డిస్కషన్స్‌ జరుగుతున్నప్పుడు, మా రెండో అన్నయ్య పంపిన ప్రసాదాన్ని నేను పరిటాల రవికి ఇచ్చాను. దాన్ని తినే ముందు ఆయన ఒక్క క్షణం ఆగి, ‘అన్నా, ఇదెవరు ఇచ్చారు?’ అని నన్ను అడిగారు. మా అన్నయ్య పంపారని చెప్పాకనే ఆయన దాన్ని స్వీకరించారు. వెంటనే నేను, ‘ఎందుకిలా ప్రసాదాన్ని అనుమానించారు?’ అని అడిగాను’. దానికి పరిటాల రవి చెప్పిన సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది.

ఇవి కూడా చదవండి

‘అది కాదన్నా… నువ్వు ఇచ్చింది ఏదైనా నేను తింటానని నా శత్రువులకు తెలుసు. అందుకే, వాళ్లు నీ ద్వారానే నాకు ప్రాణ హాని తలపెట్టే అవకాశం ఉంది. అందుకే అలా అడగాల్సి వచ్చింది’ అని రవి చెప్పుకొచ్చారు. శత్రువు మిత్రుడి రూపంలో కూడా రావచ్చనే ఆయన ఆలోచన నాకు బాగా నచ్చింది. ఆయన అప్పుడు చెప్పిన మాటలు నా మదిలో బలంగా నాటుకుపోయాయి. వెంటనే ఆ స్ఫూర్తితోనే సమరసింహారెడ్డి సినిమాలో ఒక సన్నివేశాన్ని రాసుకున్నాను. సినిమాలో బాలయ్యకు ఏమీ కాకూడదని, ఆయన తినే ప్రతీ పదార్థాన్ని ముందుగా నటుడు పృథ్వీ తిని పరీక్షించేలా సన్నివేశాలను, డైలాగులను రాసుకున్నాను. పరిటాల రవి చెప్పిన ఆ ఒక్క మాటే ఆ సీన్లు, డైలాగులకు ప్రాణం పోసింది’ అని పరుచూరి అప్పటి క్షణాలను గుర్తు చేసుకున్నారు.

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
వండే ముందు రొయ్యలు ఇలా క్లీన్ చేయకపోతే రుచి మొత్తం పోతుంది..
వండే ముందు రొయ్యలు ఇలా క్లీన్ చేయకపోతే రుచి మొత్తం పోతుంది..
ఇవి మరి అంత డేంజర్ కాదు.. త్వరలో వీరి జీవితంలో కొత్త మాయాజాలం..
ఇవి మరి అంత డేంజర్ కాదు.. త్వరలో వీరి జీవితంలో కొత్త మాయాజాలం..
జూన్ 10 రాశిఫలాలు: వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ యోగాలు..
జూన్ 10 రాశిఫలాలు: వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ యోగాలు..
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే