AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna Birthday: బాలయ్య బర్త్ డే స్పెషల్.. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..

నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ పుట్టిన రోజు (జూన్ 10) నేడు. దీంతో సోషల్ మీడియాలో బాలయ్య పేరు తెగ మార్మోగిపోతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు బాలయ్యకు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

Balakrishna Birthday: బాలయ్య బర్త్ డే స్పెషల్.. 'గాడ్ ఆఫ్ మాసెస్' గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
Balakrishna Birthday Special
Basha Shek
|

Updated on: Jun 10, 2026 | 8:23 AM

Share

తండ్రి ఎన్టీఆర్ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని చిన్నతనంలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు బాలయ్య. తండ్రితో కలిసి పలు సూపర్ హిట్ సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఆ తర్వాత హీరోగానూ తెరంగేట్రం చేసి సుమారు నాలుగు దశబ్దాలకుపైగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇప్పటికే 100 సినిమాలు పూర్తి చేసిన బాలయ్య ఇప్పుడు కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్నారు. అలాంటి బాలయ్య నేడు (జూన్ 10) తన పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా నందమూరి నటసింహం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.

1. ఎంత స్టార్ హీరో అయినా కొన్ని జానర్లను టచ్ చేయాలంటే భయపడతారు. కానీ బాలయ్య మాత్రం అన్నీ జానర్లను టచ్ చేశాడు. పౌరాణిక, జానపదం, సాంఘిక, సైన్స్‌ ఫిక్షన్‌, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్.. ఇలా అన్నీ జానర్లలో సినిమాలు చేశారు బాలయ్య.

ఇవి కూడా చదవండి

2. బాలయ్య ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించారు. అయితే చెంఘీజ్‌ఖాన్‌, గోన గన్నారెడ్డి పాత్రలో నటించాలనేది బాలకృష్ణ చిరకాల కోరికట.

3. బాలయ్యకు లక్ష్మీనరసింహ స్వామి అంటే అమితమైన భక్తి. అందుకే తన సినిమాల్లో ఎక్కువగా సింహా అనే పేరు ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంతేకాదు సింహా పేరుతో తెరకెక్కిన చిత్రాలన్నీ దాదాపు సూపర్‌హిట్‌ గా నిలిచాయి.

4. బాలయ్య ఇప్పటి వరకు 17 సినిమాల్లో డ్యూయెల్‌ రోల్‌ చేశారు. ఇక తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి 10కిపైగా సినిమాల్లో నటించారు.

5. ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఇప్పటివరకు బాలయ్య కెరీర్ లో ఒక్క రీమేక్‌ సినిమా కూడా లేదు.

6. కాగా తన తండ్రి లానే క్రమశిక్షనకు ఎంతో ప్రాధాన్యమిస్తారు బాలయ్య. తెల్లవారుజామునే నిద్రలేచి, పూజ చేయనిదే ఎక్కడికీ వెళ్లరట ఈ నందమూరి హీరో.

7. కాగా ఆదిత్య 369 కు సీక్వెల్ చేయాలన్నది బాలయ్య బాబు కల అట. అంతేకాదు ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించాలనుకుంటున్నారట. త్వరలోనే తన కల నెరవేరనుందని గట్టిగా చెబుతున్నారు బాలయ్య.

ఇక సినిమాల విషయానికి వస్తే.. అఖండ 2 తాండవం సినిమాలో చివరిగా కనిపించారు బాలయ్య. దీని తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారీ నందమూరి నటసింహం. అలాగే కొరటాల శివ దర్శకత్వంలోనూ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. త్వరలోనే వీటి గురించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

సోషల్ మీడియాలో మార్మోగుతోన్న బాలయ్య పేరు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us