AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం.. ఇలా చేస్తే ముద్ద అవ్వకుండా పర్‌ఫెక్ట్‌గా వస్తుంది.. ఇష్టంగా లాగించేస్తారు!

దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన అల్పాహారాల్లో రవ్వ ఉప్మా ఒకటి. బ్యాచిలర్స్ నుండి గృహిణుల వరకు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో చేసుకోగలిగే బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఇది. అయితే, ఉప్మా చేయడం చాలా తేలికగా అనిపించినప్పటికీ, చాలామందికి అది పర్‌ఫెక్ట్‌గా రాదు. కొందరికి ముద్దగా అయిపోతే, మరికొందరికి రవ్వ సరిగ్గా ఉడకక గడ్డలు కడుతుంది. హోటల్‌లో లాగా పొడిపొడిగా, టేస్టీగా ఉండే ఉప్మాను ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇప్పుడు స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం.

హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం.. ఇలా చేస్తే ముద్ద అవ్వకుండా పర్‌ఫెక్ట్‌గా వస్తుంది.. ఇష్టంగా లాగించేస్తారు!
How To Make Upma
Jyothi Gadda
|

Updated on: Jun 10, 2026 | 8:34 AM

Share

ఉదయాన్నే ఆరోగ్యకరమైన, రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకునే వారికి రవ్వ ఉప్మా ఒక ఉత్తమమైన ఎంపిక. చాలామంది ఉప్మా చేసేటప్పుడు అది ముద్దగా అయిపోతుందని లేదా గడ్డలు కడుతుందని ఇబ్బంది పడుతుంటారు. అయితే, సరైన కొలతలతో, కొన్ని చిట్కాలను పాటిస్తే హోటల్ స్టైల్‌లో పొడిపొడిగా, నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉప్మాను ఇంట్లోనే సులభంగా తయారు చేయవచ్చు. తక్కువ సమయంలో చేసుకోగలిగే ఈ సాంప్రదాయ వంటకం శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. తయారీ విధానం, కావలసిన పదార్థాలు ఇవే..

కావలసిన పదార్థాలు ఇవే..

ఉప్మా రవ్వ (సూజీ) – 1 కప్పు

ఇవి కూడా చదవండి

నీరు – 2.5 నుండి 3 కప్పులు

నూనె లేదా నెయ్యి – 2-3 చెంచాలు

ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు – తాలింపునకు సరిపడా

పచ్చిమిర్చి – 2 (సన్నని తరుగు)

అల్లం ముక్కలు – 1 చెంచా

ఉల్లిపాయ – 1 (సన్నని తరుగు)

కరివేపాకు, కొత్తిమీర – కొద్దిగా

జీడిపప్పు – 8-10

నిమ్మరసం – 1 చెంచా

ఉప్పు – రుచికి సరిపడా

తయారుచేసే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి, కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి రవ్వను తక్కువ మంటపై దోరగా వేయించాలి. రవ్వ మంచి సువాసన వచ్చి, రంగు పసిమి రంగులోకి మారేంతవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉప్మా ముద్దగా అవ్వకుండా పొడిపొడిగా వస్తుంది.

అదే పాన్‌లో మరికొద్దిగా నూనె లేదా నెయ్యి వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, జీడిపప్పు వేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మీకు నచ్చితే క్యారెట్, బఠానీ వంటి కూరగాయలు కూడా వేసుకోవచ్చు. పోపు వేగిన తర్వాత అందులో 1 కప్పు రవ్వకు 2.5 కప్పుల చొప్పున నీరు పోయాలి. ఉప్మా మరింత మెత్తగా రావాలనుకుంటే 3 కప్పుల నీటిని వాడుకోవచ్చు. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి, నీటిని బాగా మరగనివ్వాలి.

నీరు బాగా మరుగుతున్నప్పుడు, మంటను పూర్తిగా తగ్గించి, వేయించి పెట్టుకున్న రవ్వను ఒక చేత్తో కొద్దికొద్దిగా పోస్తూ.. మరో చేత్తో గరిటెతో తిప్పుతూ ఉండాలి. దీనివల్ల గడ్డలు కట్టకుండా ఉంటుంది. రవ్వ నీటిని పీల్చుకున్న తర్వాత మూత పెట్టి, లో ఫ్లేమ్‌లో 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చివరగా పైనుంచి కొద్దిగా కొత్తిమీర, ఒక చెంచా నెయ్యి, నిమ్మరసం చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. వేడివేడి, గుమగుమలాడే పర్‌ఫెక్ట్ రవ్వ ఉప్మా సిద్ధం. దీనిని అల్లం పచ్చడి లేదా కొబ్బరి పచ్చడితో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us