Dulquer Salmaan: మరో టాలీవుడ్ డైరెక్టర్‌కు దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?

దుల్కర్ సల్మాన్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ఈ పేరు మరింత దగ్గరయింది. మలయాళ స్టార్ హీరో అయిన దుల్కర్ రీసెంట్గా తెలుగులో డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Dulquer Salmaan: మరో టాలీవుడ్ డైరెక్టర్‌కు దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?
Dulquer Salmaan
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 18, 2022 | 8:20 PM

దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ఈ పేరు మరింత దగ్గరయింది. మలయాళ స్టార్ హీరో అయిన దుల్కర్ రీసెంట్గా తెలుగులో డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో సీతారామం సినిమాలో దుల్కర్ నటించిన విషయం తెలిసిందే. ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. తెలుగు భారీ రెస్పాన్స్ రావడంతో దుల్కర్ సల్మాన్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ క్రమంలోనే మరో టాలీవుడ్ దర్శకుడికి దుల్కర్ ఛాన్స్ ఇచ్చారన్న టాక్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

దుల్కర్ సల్మాన్ తెలుగు దర్శకుల పనితీరుకు ఫిదా అయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల ప్రస్తుతం ధనుష్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ధనుష్ ప్రస్తుతం సర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత శేఖర్ కమ్ములతో ధనుష్ సినిమా ఉంటుంది. అయితే శేఖర్ కమ్ముల ధనుష్ సినిమాకు టైం ఉండటంతో ఈ గ్యాప్ లో దుల్కర్ తో సినిమా చేయాలనీ చూస్తున్నారట. ఇప్పటికే శేఖర్ కమ్ముల కోసం అదిరిపోయే కథను కూడా సిద్ధంచేశారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.