Dil Raju: ఇంకా చర్చలు జరపాల్సి ఉంది.. తొందరలోనే షూటింగ్స్‌ను మొదలు పెడతాం : దిల్ రాజు
సినిమా షూటింగ్‌ల పునఃప్రారంభంపై, సినీపరిశ్రమ సమస్యలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు ఫిలిం ఛాంబర్ సభ్యులు..అయితే ఆగస్టు 1 నుంచి నిలిచిపోయిన సినిమా షూటింగ్‌ల పునఃప్రారంభంపైఇంకా క్లారిటీ రాలేదు.
సినిమా షూటింగ్‌ల పునఃప్రారంభంపై, సినీపరిశ్రమ సమస్యలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు ఫిలిం ఛాంబర్ సభ్యులు..అయితే ఆగస్టు 1 నుంచి నిలిచిపోయిన సినిమా షూటింగ్‌ల పునఃప్రారంభంపైఇంకా క్లారిటీ రాలేదు. చర్చల అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ.. ”మా” అసౌసియేషన్ లో జరుగుతున్న వాటి పై కూడా చర్చించాం.. అటు డైరెక్టర్స్ తో టెక్నీషన్స్ తో కూడా మాట్లాడం.. మరో మూడు నాలుగు రోజులో మరిన్ని మీటింగ్స్ ఉన్నాయి. మల్టీ ప్లెక్స్ లలో టికెట్ ధరల పై చర్చించాం.. ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా టికెట్ ధరలు ఉండాలని మేము చర్చించాం అన్నారు. ఇక సింగిల్ స్క్రీన్ టికెట్స్ ధరలపై రేపు నిర్ణయం తీసుకుంటాం..అలాగే తొందరలోనే షూటింగ్స్ ను తిరిగి మొదలు పెడతాం అని దిల్ రాజు అన్నారు.
మేము ఇంకా పూర్తి స్థాయిలో చర్చలు జరపలేదు.. మరో రెండు మూడు రోజుల్లో అన్ని పూర్తి చేసుకొని మా నిర్ణయాన్ని మీడియా ముందే తెలుపుతాము. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవించారు. బాలీవుడ్ వాళ్ళు కూడా ఇక్కడ షూటింగ్స్ ఆపడం పై ఆరా తీస్తున్నారు. తమిళ్ లోనూ మీడియా వాళ్ళు అడుగుతున్నారు టాలీవుడ్ లో ఏంజరుగుతుంది అని. ఫైనల్ ప్రెస్ మీట్ లో మేము ఏం చేశాం .. ఏం సాధించాం అన్నది చెప్తామని దిల్ రాజు అన్నారు. మొత్తంగా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతాయన్నదని పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.