AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIFA Digital Awards 2025: ఐఫా 2025 అవార్డ్స్ విన్నర్స్ వీరే.. ఉత్తమ నటీనటులు ఎవరంటే..

భారతీయ సినీపరిశ్రమలో విశేషంగా భావించే ఐఫా అవార్డుల వేడుక కన్నుల పండగగా జరిగింది. పింక్ సిటీ జైపూర్ వేదికగా రెండు రోజులపాటు ఈ కార్యక్రమం జరగ్గా.. మొదటి బాలీవుడ్ సినీతారలు, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ వైరలవుతున్నాయి.

IIFA Digital Awards 2025: ఐఫా 2025 అవార్డ్స్ విన్నర్స్ వీరే.. ఉత్తమ నటీనటులు ఎవరంటే..
Iifa Awards 2025
Rajitha Chanti
|

Updated on: Mar 09, 2025 | 11:41 AM

Share

సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల ప్రధానోత్సవ వేడుక శనివారం అట్టహాసంగా జరిగింది. జైపూర్ వేదికగా జరిగిన ఈ వేడుకలో మొదటి రోజు బాలీవుడ్ స్టార్స్ పాల్గొన్నారు. ఈ వేదికపై పంచాయత్, అమర్ సింగ్ చమ్కిలా సినిమాలు అనేక అవార్డులు గెలుచుకున్నాయి. ఈ ఏడాది ఐఫా అవార్డుల వేడుకలకు బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ హోస్టింగ్ చేస్తున్నారు. కరీనా కపూర్ ఖాన్ 25వ IIFA ఎడిషన్‌లో ప్రదర్శన ఇచ్చారు. అలాగే ఆమె తాత దిగ్గజ చిత్రనిర్మాత రాజ్ కపూర్‌కు అవార్డుల ప్రదానోత్సవంలో నివాళులర్పించారు.

విజేతలు వీరే..

ఉత్తమ చిత్రం: అమర్ సింగ్ (చమ్కిలా)

ఇవి కూడా చదవండి

ఉత్తమ నటుడు: విక్రాంత్ మాస్సే (సెక్టార్ 36)

ఉత్తమ నటి: కృతి సనన్ (దో పట్టి)

ఉత్తమ దర్శకుడు : ఇంతియాజ్ అలీ (అమర్ సింగ్ చమ్కిలా)

ఉత్తమ సహయ నటి : అనుప్రియ గోయెంకా (బెర్లిన్)

ఉత్తమ సహయ నటుడు : దీపక్ దోబ్రియాల్ (సెక్టార్ 36)

ఉత్తమ కథ ఒరిజినల్ (చిత్రం): కనికా ధిల్లాన్ (దో పట్టి)

ఉత్తమ సిరీస్: పంచాయత్ సీజన్ 3

ఉత్తమ నటి : శ్రేయ చౌదరి (బాండిష్ బాండిట్స్ సీజన్ 2 )

ఉత్తమ నటుడు : జితేంద్ర కుమార్ ( పంచాయత్ సీజన్ 3)

ఉత్తమ దర్శకుడు : దీపక్ కుమార్ మిశ్రా (పంచాయత్ సీజన్ 3)

ఉత్తమ సహయ నటి : సంజీదా షేక్ (హీరామండి: ది డైమండ్ బజార్)

ఉత్తమ సహయ నటుడు : ఫైసల్ మాలిక్ (పంచాయత్ సీజన్ 3)

ఉత్తమ కథ ఒరిజినల్ (సిరీస్): కోటా ఫ్యాక్టరీ సీజన్ 3

ఉత్తమ రియాలిటీ లేదా ఉత్తమ స్క్రిప్ట్ లేని సిరీస్: ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్

ఉత్తమ డాక్యుసీరీస్/డాక్యు ఫిల్మ్: యో యో హనీ సింగ్: ఫేమస్

ఉత్తమ టైటిల్ ట్రాక్: అనురాగ్ సైకియా (మిస్‌మ్యాచ్డ్ సీజన్ 3 నుండి ఇష్క్ హై )

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..