AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara 2: ఆ వార్తలు అవాస్తవం.. జూనియర్ ఆర్టిస్ట్ మృతిపై కాంతార 2 టీమ్ కీలక ప్రకటన

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం లో నటిస్తోన్న చిత్రం 'కాంతార: చాప్టర్ 1'. ఇటీవల ఈ సినిమాకు పనిచేస్తోన్న ఓ జూనియర్ ఆర్టిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై కాంతార 2 టీమ్ స్పష్టత ఇచ్చింది. జూనియర్ ఆర్టిస్ట్ మరణాన్ని చిత్ర బృందానికి ముడిపెట్టద్దంటూ నిర్మాణ సంస్థ 'హోంబాలే ఫిల్మ్స్' ఒక ప్రకటన విడుదల చేసింది.

Kantara 2: ఆ వార్తలు అవాస్తవం.. జూనియర్ ఆర్టిస్ట్ మృతిపై  కాంతార 2 టీమ్ కీలక ప్రకటన
Kantara 2 Movie
Basha Shek
|

Updated on: May 09, 2025 | 8:51 AM

Share

‘కాంతార: చాప్టర్ 1’ చిత్రంలో పనిచేస్తున్న జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ఇటీవల ప్రమాదవశాత్తూ మరణించాడు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కపిల్ మరణించాడంటూ వార్తలు వచ్చాయి. ఈ సంఘటనకు సంబంధించి నిర్మాణ సంస్థ ‘హోంబాలే ఫిల్మ్స్’ వివరణ ఇచ్చింది . కపిల్ మరణించిన రోజున ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా షూటింగ్ జరగలేదని నిర్మాతలు స్పష్టం చేశారు. ‘ఎం.ఎఫ్. కపిల్ మృతికి మా ప్రగాఢ సానుభూతి. ఆయన కుటుంబానికి, ఆయన సన్నిహితులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తి లభించాలని ప్రార్థిస్తున్నాము. ఈ క్లిష్ట సమయంలో వారికి మా సానుభూతి. ఇదే సందర్భంగా ఈ సంఘటన కాంతారా సెట్‌లో జరగలేదని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాం. ఆ రోజు షూటింగ్ షెడ్యూల్ లేదు. కపిల్ మరణానికి కాంతార 2 షూటింగ్ కు సంబంధం లేదు. దయ చేసి ఈ సంఘటనను కాంతారా 2 చిత్ర బృంద సిబ్బందితో ముడిపెట్టవద్దని మేము అభ్యర్థిస్తున్నాం’ అని ‘హోంబాలే ఫిల్మ్స్’ లేఖలో స్పష్టం చేసింది.

రిషబ్ శెట్టి కాంతారా 2 చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రను కూడా పోషిస్తున్నాడు. మే 6న కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ నీటిలో మునిగి మరణించాడు. ఉడిపి జిల్లా బైందూర్ లోని కొల్లూరులో ఈ ఘటన జరిగింది. కపిల్ తన బృందంతో కలిసి కొల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లాడు. నీటి లోతు తెలియకనే వారు నదిలోకి దిగడంతో ఊపిరాడక అతను చనిపోయాడు. ఆ సమయంలో అతను నీటిలో మునిగి చనిపోయాడు. అయితే ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా షూటింగ్ సమయంలో జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ మరణించి ఉండవచ్చని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు నిర్మాతల నుండి అధికారిక స్పష్టత వచ్చింది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

హోంబలే ఫిల్మ్స్ ట్వీట్..

 కాంతార 2 లో రిషభ్ శెట్టి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.