AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ బ్యూటీ బ్యాగ్రౌండ్ మాములుగా లేదు భయ్యో.. రిపోర్టర్ నుంచి స్టార్ హీరోయిన్‏గా.. సొంతంగా ఐలాండ్..

ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రత్యేక పాటలతో ఫేమస్ అవుతున్న స్టార్స్ చాలా మంది ఉన్నారు. కానీ స్పెషల్ సాంగ్స్ కోసమే కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ముద్దుగుమ్మల గురించి మీకు తెలుసా.. ? అతి తక్కువ సమయంలోనే తమకంటూ ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వరుస పోస్టులతో సందడి చేస్తున్నారు.

Tollywood: ఈ బ్యూటీ బ్యాగ్రౌండ్ మాములుగా లేదు భయ్యో.. రిపోర్టర్ నుంచి స్టార్ హీరోయిన్‏గా.. సొంతంగా ఐలాండ్..
Jacqueline Fernandez
Rajitha Chanti
|

Updated on: May 09, 2025 | 8:38 AM

Share

సినీరంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే సెలబ్రెటీలలో ఈ వయ్యారి ఒకరు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. స్పెషల్ పాటలతోనే విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. అంతేకాదు..ఆమెకు సొంతంగా ఐలాండ్ సైతం ఉండడం గమనార్హం. ఇంతకీ ఈ వయ్యారి ఎవరో తెలుసా.. ? శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. శ్రీలంక నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు టాప్ హీరోయిన్ గా ఫేమస్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా… తనే బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బహ్రెయిన్‌లో పుట్టి పెరిగింది. తండ్రి ఎల్రాయ్ ఫెర్నాండెజ్ శ్రీలంక బర్గర్ కమ్యూనిటీకి చెందినవారు. ఇక తల్లి కిమ్ మలేషియా, కెనడా మూలాలు కలిగిన వ్యక్తి. ఆమె ఎయిర్ హోస్టెస్. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం నుండి మాస్ కమ్యూనికేషన్‌లో పట్టా పొందిన తర్వాత జాక్వెలిన్ శ్రీలంకలో టెలివిజన్ రిపోర్టర్‌గా పనిచేసింది. ఆమె 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక విజేతగా నిలిచింది. అలాగే అదే ఏడాది మిస్ యూనివర్స్‌లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించింది. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన అలాడిన్ అనే ఫాంటసీ మూవీతో సినీరంగంలోకి అడుగుపెట్టింది జాక్వెలిన్.

2011లో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ మర్డర్ 2తో ఆమెకు గుర్తింపు వచ్చింది. 2012లో హౌస్‌ఫుల్ 2, 2013లో రేస్ 2 వంటి కొన్ని హిట్ చిత్రాలలో నటించింది. 2009లో సల్మాన్ ఖాన్ నటించిన కిక్ సినిమా ఆమె జీవితాన్ని మార్చేసింది. ఇదిలా ఉంటే.. 2021 నుంచి ఆమె రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో చిక్కుకుంది. ఇదే కేసులో అరెస్ట్ అయిన సుఖేష్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ ప్రేమలో ఉందనే ప్రచారం నడించింది. దీంతో ఈ కేసులో ఆమెకు సైతం ప్రమేయం ఉందనే ఆరోపణలు వచ్చాయి.

ఇదిలా ఉంటే.. నివేదికల ప్రకారం శ్రీలంక దక్షిణ తీరంలో ఆమెకు సొంతంగా ఓ ఐలాండ్ ఉన్నట్లు సమాచారం. దానిని అమె రూ.3 కోట్లకు కొనుగోలు చేసిందని టాక్. ఇక జాక్వెలిన్ ఆస్తులు రూ.116 కోట్లకు పైగానే ఉన్నట్లు అంచన. అలాగే సినిమాలు, బ్రాండ్స్, యాడ్స్ ద్వారా జాక్వెలిన్ సంపాదిస్తుంది.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు