AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఏంట్రా బాబూ ఈ సినిమా.. ముసలోడితో పెళ్లి.. ప్రియుడితో రివెంజ్.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..

మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోహీరోయిన్స్, భారీ బడ్జెట్ లేకుండానే నిర్మించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. ఇప్పుడు అవే సినిమాలు ఓటీటీలోనూ దూసుకుపోతున్నాయి. తాజాగా ఓ రొమాంటిక్ రివేంజ్ డ్రామా ఓటీటీలో ట్రెండ్ అవుతుంది.

OTT Movie: ఏంట్రా బాబూ ఈ సినిమా.. ముసలోడితో పెళ్లి.. ప్రియుడితో రివెంజ్.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..
Chaturam Moive
Rajitha Chanti
|

Updated on: May 09, 2025 | 9:47 AM

Share

సాధారణంగా మలయాళం సినిమాలకు తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. కొన్నాళ్లుగా అక్కడ సూపర్ హిట్ అయిన చిత్రాలకు తెలుగులో మంచి రెస్పాన్స్ వస్తుంది. స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినా బలమైన కంటెంట్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈమధ్య కాలంలో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలతోపాటు రొమాంటిక్ సినిమాలు సైతం దూసుకుపోతున్నాయి. ఇక తాజాగా ఓటీటీలో సరికొత్త మలయాళీ బోల్డ్ థ్రిల్లర్ మూవీ ట్రెండ్ అవుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై మంచి రెస్పాన్స్ వస్తుంది. అదే చతురం. సైనా ప్లే ఓటీటీలో అదే పేరుతో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా. ఇందులో మలయాళీ యాక్టర్స్ స్వాసిక, రోషన్ మాథ్యూ, అలెన్సియన్ లే లోఫేజ్ కీలకపాత్రలు పోషించారు. సిద్ధార్థ్ భరతన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళంలో నేరుగా థియేటర్లలో విడుదలైంది. కానీ ఇప్పుడు తెలుగు వెర్షన్ మాత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రస్తుతం ఈ సినిమాకు ఐఎమ్‏డీబీలో 6.2 రేటింగ్ కలిగి ఉంది. వాస్తవ ఘటనల స్పూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ సిద్ధార్థ్. శారీరకంగా వేధింపులకు గురిచేసే భర్తపై ఓ గృహిణి తన ప్రియుడితో కలిసి ఎలా రివేంజ్ తీర్చుకుంది అనేది సినిమా. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా 2022లో విడుదలైంది.

కథ విషయానికి వస్తే..

ఎల్దో అనే వ్యక్తి సొసైటీలో పేరున్న ధనవంతుడు. భార్య దూరం కావడంతో సెలెనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వివాహం తర్వాత ఆ అమ్మాయిని చిన్న చిన్న కారణాలకే దారుణంగా సింహిస్తుంటాడు. అయితే అనుకోకుండా ఎల్దోకు ప్రమాదం జరగడంతో మంచానికే పరిమితమైపోతాడు. అతడిని చూసుకోవడానికి కేర్ టేకర్ గా బాల్తజార్ అనే యువకుడు ఆ ఇంటికి వస్తాడు. కొన్నాళ్లకు బాల్తజార్ తో సెలెనా ప్రేమలో పడుతుంది. ఆ తర్తాత తన ప్రియుడు బాల్తజార్ తో కలిసి సెలెనా తన భర్తపై ఎలా రివేంజ్ తీర్చుకుంది అన్నది సినిమా.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..

Follow Us
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..