Teja Sajja: ఆ పెద్ద దర్శకుడు నన్ను వాడుకొని వదిలేశాడు.. తేజ సజ్జ షాకింగ్ కామెంట్స్
యంగ్ హీరో తేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన తేజ ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. త్వరలోనే మిరాయ్ సినిమాతో పేక్షకుల ముందుకు రానున్నాడు.

యంగ్ హీరో తేజ సజ్జ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన తేజ ఇప్పుడు హీరోగా మారాడు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే జాంబిరెడ్డి, హనుమాన్‌లాంటి డిఫరెంట్ కథలతో హిట్స్ అందుకున్నాడు. అంతకు ముందు ఓ బేబీ సినిమాలో స్పెషల్ పాత్రలో నటించాడు. ఆతర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హనుమాన్ సినిమా ఏకంగా రూ.300కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు మిరాయ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మైథలాజికల్ థ్రిల్లర్ గా మిరాయ్ సినిమా తెరకెక్కుతుంది.
మాఫియా డాన్‌తో కలిసి అరెస్ట్.. చేతులారా కెరీర్ నాశనం చేసుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
మిరాయ్ సినిమా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నాడు తేజ సజ్జ. తాజాగా ఓ ఇంటర్యూలో తేజ సజ్జ మాట్లాడుతూ.. ఆ పెద్ద డైరెక్టర్ నన్ను 15 రోజులు వాడుకుని వదిలేశాడు అని చెప్పి షాక్ ఇచ్చాడు. ఓ పెద్ద దర్శకుడు తనకు కథ చెప్తే ఒకే చేశానని చెప్పాడు.. కానీ ఆ దర్శకుడు తనను మోసం చేశాడని తేజ చెప్పుకొచ్చాడు. ఇంతకూ ఆ దర్శకుడు ఎవరంటే..
Bigg Boss 9 : బిగ్ బాస్ హౌస్‌లోకి ఈ ఇద్దరూ అమ్మాయిలు.. సామాన్యుల కోటాలో ఎంట్రీ
తేజ మాట్లాడుతూ.. ఓ పెద్ద డైరెక్టర్ నన్ను కలిసి కథ చెప్పాడు. కథ చాలా బాగుంది. కథ నచ్చడంతో నేను సినిమా చేస్తానని చెప్పాను. 15 రోజుల పాటు షూటింగ్ కూడా చేశా.. అయితే ఆతర్వాత నా ప్లేస్‌లో వేరొక హీరోని తీసుకున్నారు. నన్ను మాక్ షూటింగ్ కోసమే తీసుకున్నారని, అందుకే 15 రోజుల పాటు వాడుకొని వదిలేశారని ఆ తర్వాత తెలిసింది అని చెప్పుకొచ్చాడు తేజ. అయితే ఆ దర్శకుడు ఎవరు.? తన ప్లేస్ లో రీప్లేస్ చేసిన హీరో ఎవరు అనేది చెప్పలేదు. తేజ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఒకరు స్టార్ హీరో, మరొకరు పెద్ద దర్శకుడు..! ఈ ఫొటోలో వెంకీమామతో పాటు ఉన్నదిఎవరో గుర్తుపట్టారా.?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








