- Telugu News Entertainment Tollywood Do you know who this heroine is suddenly gave a break from Movies? She is Kavya Kalyan Ram
ఏమైపోయావ్ అమ్మడు..! స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. కట్ చేస్తే కనిపించకుండా మాయమైంది
ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. కొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అవుతున్నారు. అలాగే కొంతమంది అవకాశాలు లేక సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే కానీ క్రేజ్ మాత్రం విపరీతంగా సొంతం చేసుకుంది.

Updated on: Sep 08, 2025 | 4:36 PM
టాలీవుడ్‌లో ఇప్పటికే చాలా మంది యంగ్ బ్యూటీలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ కుర్ర భామలు దూసుకుపోతున్నారు. చిన్న సినిమాలతోనే సూపర్ హిట్స్ అందుకుంటూ అవకాశాలు అందుకుంటున్నారు. ఒక్క సినిమా రిలీజ్ అవ్వగానే మినిమమ్ మూడు సినిమాలను లైనప్ చేస్తున్నారు. కానీ ఈ అమ్మడు మాత్రం అలా కాదు.. హీరోయిన్ గా మూడు సినిమాలు చేసింది. వాటిలో రెండు సూపర్ హిట్స్.. ఒకటి డిజాస్టర్. మొదటి రెండు సినిమాలు హిట్ అవ్వగానే ఈ అమ్మడు పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది. ఇక ఒక్క సినిమా డిజాస్టర్ అవ్వగానే సినిమాలకు గ్యాప్ తీసుకుంది. అయితే ఆమె నిజంగానే గ్యాప్ తీసుకుందా లేక అవకాశాలు రావడంలేదా అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ ఆ అమ్మడు ఎవరో తెలుసా.?
మాఫియా డాన్‌తో కలిసి అరెస్ట్.. చేతులారా కెరీర్ నాశనం చేసుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కానీ హీరోయిన్ గా అదృష్టం కలిసి రావడం లేదు ఆమెకు.. తెలుగులో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పదుల సంఖ్యలో చైల్డ్ ఆర్టిస్ట్ సినిమాలుగా చేసి ఇప్పుడు హీరో, హీరోయిన్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు ఆమె కావ్య కళ్యాణ్ రామ్. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. గంగోత్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది.
Bigg Boss 9 : బిగ్ బాస్ హౌస్‌లోకి ఈ ఇద్దరూ అమ్మాయిలు.. సామాన్యుల కోటాలో ఎంట్రీ
మసూద సినిమాతో హీరోయిన్ గా మారింది కావ్య కళ్యాణ్ రామ్. తొలి సినిమాతోనే హీరోయిన్ గా ఆకట్టుకుంది. తన నటనతో మెప్పించింది ఈ చిన్నది. ఆతర్వాత వేణు దర్శకత్వంలో బలగం సినిమాలో నటించింది. బలగం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆతర్వాత ఆమె హీరోయిన్ గా చేసిన ఉస్తాద్ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత కావ్య సినిమాలకు గ్యాప్ తీసుకుంది. సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతుంది. నెట్టింట ఈ భామ షేర్ చేసే ఫోటోలు, వీడియోలు కుర్రాళ్లను తెగ కవ్విస్తున్నాయి.
ఒకరు స్టార్ హీరో, మరొకరు పెద్ద దర్శకుడు..! ఈ ఫొటోలో వెంకీమామతో పాటు ఉన్నదిఎవరో గుర్తుపట్టారా.?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








