AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

300కు పైగా సినిమాల్లో నటించిన ఈ ఫేమస్ విలన్ గుర్తున్నాడా? ఇప్పుడు ఇతని కూతురు కూడా హీరోయిన్ గా! ఫొటోస్ వైరల్

1988లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇప్పటివరకు సుమారు 300కు పైగా సినిమాల్లో నటించాడు. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లో విలన్ గా, సహాయక నటుడిగా అలరించాడు. ఇప్పుడీ నటుడు కూతురు కూడా హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనుంది.

300కు పైగా సినిమాల్లో నటించిన ఈ ఫేమస్ విలన్ గుర్తున్నాడా? ఇప్పుడు ఇతని కూతురు కూడా హీరోయిన్ గా! ఫొటోస్ వైరల్
Anandaraj
Basha Shek
|

Updated on: Sep 08, 2025 | 7:25 PM

Share

ఆనంద్ రాజ్.. ఈ పేరు వింటే ఠక్కున గుర్తు పట్టకపోవచ్చు కానీ.. మోహన్ బాబు నటించిన పెదరాయుడు సినిమా విలన్ అంటే ఇట్టే గుర్తుకు వస్తాడు. పేరుకు తమిళ నటుడే అయినప్పటికీ ఆనంద్ రాజ్ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు తదితర స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి బాగా ఫేమస్ అయ్యాడు. బాలకృష్ణ నటించిన ముద్దుల మావయ్య సినిమాలో విలన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. బామ్మమాట బంగారు మాట, పల్నాటి రుద్రయ్య, లంకేశ్వరుడు, ఒంటరి పోరాటం, శత్రువు, గ్యాంగ్ లీడర్, బావ బామ్మర్ది, పెదరాయుడు, శుభాకాంక్షలు, శివ రామరాజు, చెన్నకేశవ రెడ్డి, సింహరాశి లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవరాల్ గా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 300 కుగా పైగా సినిమాల్లో నటించాడు ఆనందర్ రాజ్. ఇప్పటికీ తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడీ సీనియర్ యాక్టర్.

. ఒకప్పుడు కరడుగట్టిన విలన్ గా ఆడియెన్స్ ను భయపెట్టిన ఆనంద్ రాజ్ ఇప్పుడు తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. బెస్ట్ కమెడియన్ గా అవార్డులు కూడా అందుకుంటున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ఆడియెన్స్ ను పలకరించాడు ఆనంద్ రాజ్. బేబీ అండ్ బేబీ, చెన్నై సిటీ గ్యాంగ్ స్టర్స్ అనే సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. అయితే ఇప్పుడు ఆనంద్ రాజ్ బాటలోనే అతని కూతురు కూడా నడుస్తోందని సమాచారం. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందట. ఆనంద్ రాజ్ కూడా ఓ మంచి ప్రాజెక్టుతో తన కూతురును లాంఛింగ్ చేసే పనుల్లో ఉన్నాడట. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆనంద్ రాజ్ ఫ్యామిలీ ఫొటోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

భార్యా పిల్లలతో నటుడు ఆనంద్ రాజ్..

Anandaraj Family

Anandaraj Family

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.