AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Robinhood Review: రాబిన్ హుడ్ రివ్యూ.. నితిన్, శ్రీలీల ఖాతాలో హిట్ పడ్డట్టేనా..?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వెంకి కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాబిన్ హుడ్. భీష్మ లాంటి హిట్ సినిమా తర్వాత ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Robinhood Review: రాబిన్ హుడ్ రివ్యూ.. నితిన్, శ్రీలీల ఖాతాలో హిట్ పడ్డట్టేనా..?
Robinhood
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Mar 28, 2025 | 1:16 PM

Share

మూవీ రివ్యూ: రాబిన్ హుడ్

నటీనటులు: నితిన్, శ్రీలీల, రాజేంద్రప్రసాద్, దేవ దత్త నాగే, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్, షైన్ టామ్ చాకో తదితరులు

ఎడిటర్: కోటి

ఇవి కూడా చదవండి

సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్

సంగీతం: జీవి ప్రకాష్ కుమార్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వెంకీ కుడుముల

నిర్మాత: రవిశంకర్ ఎలమంచిలి, నవీన్ ఎర్నేని

నితిన్ హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాబిన్ హుడ్. భీష్మ లాంటి హిట్ సినిమా తర్వాత ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

రామ్ అలియాస్ రాబిన్ హుడ్ (నితిన్) అనాధ. చిన్నప్పటినుంచి ఆశ్రమంలోనే పెరుగుతాడు. అయితే సహాయం చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర కొట్టేసి అనాధాశ్రమాలకు ఇస్తూ ఉంటాడు. అతని పట్టుకోడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ విక్టర్ (షైన్ టామ్ చాకో). కానీ ఎప్పటికప్పుడు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ తప్పించుకుంటూ ఉంటాడు రామ్. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా నుంచి ఒక పని మీద నీరా వాసుదేవ్ (శ్రీలీల) ఇండియాకు వస్తుంది. ఆమెను మళ్లీ ఆస్ట్రేలియా పంపే వరకు సెక్యూరిటీగా జాన్ స్నో (రాజేంద్ర ప్రసాద్) ఉంటాడు. అదే బ్యాచ్ లో రామ్ కూడా జాయిన్ అవుతాడు. మరోవైపు రుద్రకొండ అనే ఊర్లో గంజాయి పండిస్తూ ఆ ఊరు వాళ్లను తన అదుపులోకి తీసుకుంటాడు సామి (దేవదత్త). వాళ్లతో రామ్ ఎలా పోరాడాడు.. ఆ ఊరు వాళ్ళని ఎలా కాపాడాడు అనేది మిగిలిన కథ..

కథనం:

రాబిన్ హుడ్.. ఈ పేరు చాలా కథ ఎలా ఉంటుందో చెప్పడానికి. ఎప్పటినుంచో తెలుగు సినిమాలో చూస్తున్న కథ ఇది. పెద్దవాళ్లను దోచి పేదవాళ్లకు పెట్టే కథ. దాన్నే మరోలా తీసే ప్రయత్నం చేశాడు వెంకీ కుడుముల. ఇందులో రవితేజ కిక్ ఫార్ములా ఎక్కువగా కనిపిస్తుంది. సినిమా మొదలైన 20 నిమిషాల పాటు హీరో ఎందుకు దొంగగా మారాడు.. అతను ఏం చేస్తున్నాడు.. ఎందుకు చేస్తున్నాడు అనే విషయాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు డైరెక్టర్. స్లోగా అదే కథను ముందుకు తీసుకెళ్లింది. వెంకి కుడుముల స్ట్రెంత్ కామెడీ.. చలో, భీష్మ సినిమాల్లో ఆయన చేసింది అదే. ప్రోటీన్ కథలు తీసుకున్న కూడా అందులో ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి చెప్పాడు. కానీ రాబిన్ హుడ్ లో మాత్రం అది కాస్త మిస్ అయినట్టు అనిపించింది. దానికి తోడు రొటీన్ స్టోరీ తీసుకోవడంతో స్క్రీన్ ప్లే కూడా మరింత రొటీన్ అయిపోయింది. ఇంటర్వెల్ వరకు ఏదో అలా అక్కడక్కడ కామెడీ సీన్స్ రాసుకున్నాడు కానీ సెకండ్ హాఫ్ మాత్రం అంతగా వర్కౌట్ అవ్వలేదు. మళ్లీ క్లైమాక్స్ 20 నిమిషాలు బాగా రాసుకున్నాడు. నితిన్, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకు వెన్నెల కిషోర్ సేవియర్. మనోడు కనిపించిన చాలా సన్నివేశాలు బాగా నవ్వొచ్చాయి. గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ రాసుకున్నాడు వెంకీ. దాని చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే పర్లేదు. కాకపోతే కథ అక్కడక్కడ తిరగడంతో బోర్ కొడుతుంది. భీష్మారావ్ వ్యవసాయం గురించి చాలా ఎంటర్టైనింగ్ గా చెప్పాడు వెంకీ. ఈసారి అలాంటి కామెడీ మిస్సయింది. ఏదో అలా రొటీన్ గా వెళ్ళిపోయింది సినిమా.

నటీనటులు:

నితిన్ స్క్రీన్ మీద బాగున్నాడు.. యాక్టివ్ గా కనిపించాడు. కామెడీ టైమింగ్ కూడా బాగుంది. శ్రీ లీల గురించి చెప్పడానికి ఏమీ లేదు.. మరోసారి రొటీన్ హీరోయిన్ క్యారెక్టర్ లో నటించింది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ ఉన్నంతలో కాస్త కామెడీ పండించారు. దేవదత్త విలనిజం రొటీన్ గానే ఉంది. పోలీస్ క్యారెక్టర్ లో షైన్ టామ్ పర్లేదు. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

జీవి ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ పర్లేదు. పాటలు సోసోగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. ఎడిటింగ్ చాలావరకు వీక్ అనిపించింది. కాకపోతే దర్శకుడు వెంకీ కుడుముల ఛాయిస్ కాబట్టి ఎడిటర్ ను తప్పు పట్టలేము. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కథ చాలా పాతది తీసుకున్నాడు వెంకీ. స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గానే అనిపించింది. మైత్రి మూవీ మేకర్స్ కథకు తగ్గట్టు ఖర్చు పెట్టారు.

పంచ్ లైన్:

ఓవరాల్ గా రాబిన్ హుడ్.. రొటీన్ దొంగ..!