Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీ..ఛీ నేను బర్రెలు కడగాలా..? రంగస్థలంను వదులుకున్న క్రేజీ హీరోయిన్ ఈమె..

రామ్ చరణ్ హీరోగా నటించిన "రంగస్థలం" సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2018లో విడుదలైన ఈ సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించారు, రామ్ చరణ్ కెరీర్‌లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో చిట్టిబాబుగా ఇరగదీశాడు చరణ్..

ఛీ..ఛీ నేను బర్రెలు కడగాలా..? రంగస్థలంను వదులుకున్న క్రేజీ హీరోయిన్ ఈమె..
Rangasthalam
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 28, 2025 | 7:30 AM

రామ్ చరణ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో రంగస్థలం సినిమా ఒకటి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో నటుడిగా చరణ్ మరో మెట్టు పైకి ఎక్కారు. ఈ సినిమా 1980వ దశకంలో ఒక ఊరిలో జరిగే కథను ఆధారంగా తెరకెక్కించారు సుకుమార్. రామ్ చరణ్ ఈ చిత్రంలో చిట్టిబాబు అనే పాత్రలో కనిపిస్తాడు. చరణ్ వినికిడి సమస్య ఉన్న పాత్రలో అద్భుతంగా నటించాడు. చరణ్ అన్నగా కుమార్ బాబు  పాత్రలో ఆది పినిశెట్టి, ఊరి పెద్దలైన ఫణీంద్ర భూపతి పాత్రలో జగపతి బాబు నటించి మెప్పించారు. అలాగే స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని రమాలక్ష్మి పాత్రలో చిట్టిబాబు ప్రేమికురాలిగా నటించింది. అదేవిధంగా రంగస్థలం సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ప్రాణం పోసింది.

కాగా రంగస్థలం సినిమాలో ముందుకు సమంత ప్లేస్ లో మరో హీరోయిన్ ను తీసుకున్నారట. అంతే కాదు ఆ హీరోయిన్ తో రెండు షెడ్యూల్స్ కూడా చేశారట. ఆతర్వాత ఆ హీరోయిన్ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? మలయాళ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్.. రంగస్థలం సినిమాలో ముందుగా సామ్ ప్లేస్ లో అనుపమకు సెలక్ట్ చేశారట.

అయితే సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో హీరోయిన్ కనిపిస్తుంది. సుకుమార్ రియాలిటీకి దగ్గరగా ఉండేలా పాత్రను డిజైన్ చేశారు.. దాంతో బర్రెలను కడగడం, చెరువులో తోమడం వంటివి చేయాల్సి వచ్చింది. అయితే తాను అవన్నీ చేయలేను అని చెప్పిందట అనుపమ. దాంతో సుకుమార్ ఏకంగా హీరోయిన్ మార్చేశారట. ఆ తర్వాత సమంతను పెట్టి సినిమాను తెరకెక్కించాడట సుక్కు. అప్పట్లో ఈ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో సమంత అద్భుతంగా నటించింది. ఆమె తప్ప రామలక్ష్మీ పాత్రలో మరొకరు సెట్ అవ్వరు అనేంతలా నటించింది. అయితే నిజంగా అనుపమ ఈ రోల్ ను మిస్ చేసుకుందా.? లేక ఇది కేవలం రూమర్ మాత్రమేనా అనేదాని పై మాత్రం క్లారిటీ రాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.