AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంగళవారం సీక్వెల్‌లో మెస్మరైజింగ్ బ్యూటీ.. పాయల్ ప్లేస్‌లోకి ఆ స్టార్ హీరోయిన్.?

ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత పాయల్ రాజ్ పుత్ తో అజయ్ భూపతి చేసిన మంగళవారం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే బోల్డ్‌గా నటించి మెప్పించింది పాయల్. రొమాంటిక్స్ సీన్స్ లోనూ రెచ్చిపోయి నటించింది

మంగళవారం సీక్వెల్‌లో మెస్మరైజింగ్ బ్యూటీ.. పాయల్ ప్లేస్‌లోకి ఆ స్టార్ హీరోయిన్.?
Mangalavaram
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 27, 2025 | 12:37 PM

పాయల్ రాజ్ పుత్ గుర్తుందా.? ఆర్ఎక్స్ 100 సినిమాతో పరిచయం అయ్యి.. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో నటించి ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా కుర్రకారు ఈ చిన్నదాని అందానికి ఫిదా అయ్యారు. అలాగే రొమాంటిక్ సీన్స్ లోనూ రెచ్చిపోయి నటించింది. ఇక ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఆతర్వాత చాలా కాలానికి మరోసారి అజయ్ భూపతితో మంగళవారం సినిమా చేసి భారీ హిట్ అందుకున్నాడు. మంగళవారం సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

మంగళవారం కూడా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కింది. ఈ సినిమాలోనూ పాయల్ మరోసారి తన బోల్డ్ యాక్టింగ్‌తో కట్టిపడేసింది. మంగళవారం సినిమా సూపర్ హిట్‌తో కావడంతో పాయల్‌కు మంచి క్రేజ్ వచ్చింది.  పాయల్ నటన ఈ సినిమాకే హైలైట్ అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత అజయ్ భూపతి కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. పాయల్ కూడా పెద్దగా సినిమాలను అనౌన్స్ చేయలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు మంగళవారం సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందని తెలుస్తుంది. అజయ్ భూపతీ ఇప్పుడు మంగళవారం సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ సినిమాలో ఎవరు నటించనున్నారు.? ఈసారి ఎలాంటి కాన్సెప్ట్ తో సినిమా ఆ ఉంటుంది అనే ఆసక్తికర చర్చ జరుగుతుంది. మంగళవారం సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సినిమా కోసం అజయ్ భూపతి మరో ఆసక్తికర కథను రెడీ చేస్తున్నారు. ఈసారి మరింత థ్రిల్లింగ్ గా ఉండేలా కథను సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో పాయల్ హీరోయిన్ గా చేయడం లేదు అని తెలుస్తుంది. మరో హీరోయిన్ తో సినిమా చేయాలనీ చూస్తున్నారట. అయితే ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో అటు ఫిలిం సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతుంది. ఛాలెంజ్ రోల్ కావడంతో శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ సీక్వెల్ లో తాను నటించడం లేదు అని శ్రీలీల క్లారిటీ ఇచ్చిందని తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే కెరీర్ లో స్పీడ్ అందుకుంటుంది శ్రీలీల.. దాంతో ఇప్పుడే డార్క్ మూవీలో నటించేంత రిస్క్ తీసుకోకూడదు అనుకుంటుందట.. ఇక మంగళవారం సినిమా సీక్వెల్ రెడీ అవుతుందని తెలిసి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కెనడా ఎన్నికల్లో ఖలిస్తానీవాదులకు బిగ్ షాక్!
కెనడా ఎన్నికల్లో ఖలిస్తానీవాదులకు బిగ్ షాక్!
ఇంటర్, డిగ్రీ అర్హతతో ఏపీ CID నిఘా విభాగంలో ఉద్యోగాలు.. నో ఎగ్జాం
ఇంటర్, డిగ్రీ అర్హతతో ఏపీ CID నిఘా విభాగంలో ఉద్యోగాలు.. నో ఎగ్జాం
జియో యూజర్లకు బంపర్ ఆఫర్..తక్కువ ధరలో 200 రోజుల చెల్లుబాటు ప్లాన్
జియో యూజర్లకు బంపర్ ఆఫర్..తక్కువ ధరలో 200 రోజుల చెల్లుబాటు ప్లాన్
అక్షయ తృతీయ రోజున మీ ఫ్యామిలీ మెంబర్స్‏ను ఇలా సర్ ప్రైజ్ చేయండి..
అక్షయ తృతీయ రోజున మీ ఫ్యామిలీ మెంబర్స్‏ను ఇలా సర్ ప్రైజ్ చేయండి..
తెలంగాణలో బీర్లకు పెరిగిన డిమాండ్‌..రోజుకు ఎన్ని తాగుతున్నారంటే?
తెలంగాణలో బీర్లకు పెరిగిన డిమాండ్‌..రోజుకు ఎన్ని తాగుతున్నారంటే?
ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన ప్రీతి జింతా!
ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన ప్రీతి జింతా!
నల్ల యాలకులతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు..? ఎన్నో రోగాలకు చెక్
నల్ల యాలకులతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు..? ఎన్నో రోగాలకు చెక్
వారమంతా చికెన్ లాగించేస్తున్నారా.. ఈ రిస్క్ ఉంది జాగ్రత్త!
వారమంతా చికెన్ లాగించేస్తున్నారా.. ఈ రిస్క్ ఉంది జాగ్రత్త!
ట్రెండింగ్‌లో 'ఆవిడే మా ఆవిడే' సెకెండ్ హీరోయిన్?ఇప్పుడెలా ఉందంటే?
ట్రెండింగ్‌లో 'ఆవిడే మా ఆవిడే' సెకెండ్ హీరోయిన్?ఇప్పుడెలా ఉందంటే?
30 రోజుల పాటు పరగడుపున నానబెట్టిన పల్లీలు తింటే ఏమౌతుందో తెలుసా.?
30 రోజుల పాటు పరగడుపున నానబెట్టిన పల్లీలు తింటే ఏమౌతుందో తెలుసా.?