AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dulquer Salmaan: లక్కీ బ్యూటీ..! దుల్కర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ.. దశ తిరిగినట్టే

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. ఇలా తెలుగులో బ్యాక్ బు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకున్నాడు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. ఇప్పుడు తెలుగులోనే మరో క్రేజీ ప్రాజెక్టును పట్టాలెక్కించాడీ హ్యాండ్సమ్ హీరో. క్రేజీ డైరెక్టర్ పవన్ సాదినేని కాంబినేషన్ లో దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న సినిమా అధికారికంగా ప్రారంభమైంది.

Dulquer Salmaan: లక్కీ బ్యూటీ..! దుల్కర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ.. దశ తిరిగినట్టే
Dulquer Salman
Rajeev Rayala
|

Updated on: Mar 25, 2025 | 11:57 AM

Share

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. గతేడాది దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమా పాన్ ఇండియాలో సూపర్ డూపర్ హిట్ అయింది. 2012లో విడుదలైన ‘సెకండ్ షో’ చిత్రంతో దుల్కర్ తన నట జీవితాన్ని ప్రారంభించాడు.

ఇది కూడా చదవండి : బ్యాడ్ లక్ బ్యూటీ..! పుష్పలో సమంత సాంగ్ ఈ అమ్మడే చేయాలంట.. కానీ మిస్ అయ్యింది

ఆ తర్వాత విడుదలైన ‘ఉస్తాద్ హోటల్’ సినిమా అభిమానుల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. ఇక తెలుగులోకి ఒకే బంగారం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత దుల్కర్ నటించిన సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి విజయాలను అందుకుంది. దుల్కర్ సల్మాన్ మళ్లీ తెలుగు దర్శకుడితో పని చేస్తున్నారని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి :టాలీవుడ్ విలన్ భార్య జోరు.. ఒకొక్క సినిమాకు కోట్లల్లో రెమ్యునరేషన్.. ఆమె ఎవరంటే

టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు దుల్కర్. ఈ సినిమాకు ఆకాశంలో ఓ తార అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల భామ రుహానీ శర్మ నటిస్తుందని తెలుస్తుంది. తెలుగులో చిలసౌ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల హృదయాలను దోచేసింది హీరోయిన్ రుహానీ శర్మ. చిలసౌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత సరైన క్రేజ్ మాత్రం సొంతం చేసుకోలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు దుల్కర్ సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. ఈ వార్తల్లో నిజం ఉంటే రుహానీ శర్మ రేంజ్ మారిపోయినట్టే అంటున్నారు అభిమానులు.

ఇది కూడా చదవండి :మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక బ్లాక్ బస్టర్.. కానీ క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్స్‌కు తీసిపోదు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు