నారి నారి నడుమ నువ్వేం చేస్తున్నావ్ సామీ..! ఈయన ఎవరో గుర్తుపట్టారా.? ఆయన చాలా ఫేమస్
సోషల్ మీడియా పుణ్యమా అని మనకు తెలియని ఎన్నో ఫోటోలు దర్శనమిస్తున్నాయి. సినీ సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలు ముఖ్యంగా వైరల్ అవుతుంటాయి. హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు నిత్యం నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరల్ అవుతుంది.

సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయి. కుర్రాళ్ళు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. ఇంటర్ నెట్ పుణ్యమా అని కొత్త కొత్త విషయాలతో పాటు.. ఎక్కడ ఏం జరుగుతున్నాయో తెలుసుకుంటున్నారు. అలాగే సినిమాల విషయానికొస్తే సినిమా అప్డేట్స్ తో పాటు .. హీరో, హీరోయిన్స్ పర్సనల్ విషయాలు కూడా తెలుసుకుంటున్నారు. అలాగే సినీ సెలబ్రెటీలకు సంబందించిన చిన్ననాటి ఫోటోలు నిత్యం నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. హీరో, హీరోయిన్స్ ఫోటోలను నెటిజన్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ సందడి చేస్తుంటారు. తాజాగా ఓ త్రో బ్యాక్ ఫోటో నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పై ఫోటో గమనించారా.? ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా.? ఆయన చాలా ఫెమస్
పై ఫొటోలో ఉన్న హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ ఆ ఇద్దరూ.. రమ్యకృష్ణ, నగ్మా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. కాగా ఈ ఇద్దరి మధ్య కనిపిస్తున్న కుర్రాడు ఎవరో కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు.. ఆయన పేరు చెప్తే ఈయనా..! అని షాక్ అవుతారు.. ఆ ఫొటోలో ఉన్నది ఎవరో కాదు ప్రముఖ జ్యోతిష్యుడు అని చెప్పుకునే వేణు స్వామి.
వేణు స్వామి.. పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేని పేరు ఇది. సినిమా సెలబ్రెటీల జాతకాలు చెప్పడం, రాజకీయనాయకుల జాతకాలు చెప్పడంతో చాలా పాపులర్ అయ్యారు ఈయన. సెలబ్రెటీలు జాతకాలు చెప్పడంతో ఆయన సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యాడు. ఇకపై సెలబ్రిటీల జాతకాలను చెప్పనంటూ కొన్ని నెలల క్రితం సంచలన ప్రకటన చేసిన వేణు స్వామీ.. మొన్నామధ్య నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంపై జోస్యం చెప్పారు. దీంతో అక్కినేని అభిమానులు గురూజీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టు సంఘాలు కూడా స్వామీజీ పై ఫైర్ అయ్యాయి. ఇప్పటికే ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు వేణు స్వామి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.