AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకో తెలుసా?

Water Bottle Trick: భద్రత అనేది మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలపైనే ఆధారపడి ఉంటుంది. ముందస్తు జాగ్రత్త ఎప్పుడూ నష్టాన్ని చేకూర్చదు. కాబట్టి, మీ తదుపరి ప్రయాణంలో హోటల్ రూమ్‌లోకి ప్రవేశించిన వెంటనే ఈ సింపుల్ వాటర్ బాటిల్ ట్రిక్‌ని ప్రయత్నించి, మీ ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చుకోండి!

Venkata Chari
|

Updated on: Jun 21, 2026 | 7:55 AM

Share
Water Bottle Hack Under Bed: ట్రావెలింగ్ అంటే ఇష్టపడేవారైనా, ఆఫీస్ పనుల మీద తరచూ జర్నీలు చేసేవారైనా హోటల్ గదుల్లో బస చేయడం సాధారణం. అయితే, రూమ్‌లోకి అడుగు పెట్టగానే మనం చేసే కొన్ని పొరపాట్లు మన ప్రాణాలకే ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది. తాజాగా ఓ ఎయిర్‌హోస్టెస్ పంచుకున్న సింపుల్ సెక్యూరిటీ ట్రిక్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ బాటిల్ ట్రిక్ ఏంటి? దాని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం.

1 / 6
మనం ఏదైనా కొత్త ఊరు వెళ్లినప్పుడు బస చేయడానికి మంచి హోటల్ రూమ్‌ను ఎంచుకుంటాం. లోపలికి వెళ్లగానే లగేజ్ పక్కన పడేసి, కాసేపు రిలాక్స్ అవ్వాలని అనుకుంటాం. కానీ, నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ డచ్ విమానయాన సంస్థలో పనిచేసే ఎస్తేర్ స్ట్రస్ అనే ఎయిర్‌హోస్టెస్ మాత్రం, రూమ్‌లోకి వెళ్లగానే అస్సలు రిలాక్స్ అవ్వద్దని హెచ్చరిస్తోంది. ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక చిన్న చిట్కా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆశ్చర్యపరుస్తోంది. అదే "వాటర్ బాటిల్ హ్యాక్".

2 / 6
సాధారణంగా హోటల్ సిబ్బంది గదిని శుభ్రం చేసినప్పటికీ, మనం వెళ్లే సమయానికి అక్కడ ఎవరైనా ముసుగు దొంగలు లేదా ఆగంతకులు దాక్కునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మంచం కింది భాగం చీకటిగా ఉండటం వల్ల అక్కడ ఎవరైనా ఉన్నారా లేదా అని మనం నేరుగా వంగి చూడటం అంత సురక్షితం కాదు. ఒకవేళ అక్కడ ఎవరైనా సాయుధులు ఉంటే, మనపై ఒక్కసారిగా దాడి చేసే అవకాశం ఉంది.

3 / 6
ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికే ఈ వాటర్ బాటిల్ ట్రిక్ ఉపయోగపడుతుంది. మీరు రూమ్‌లోకి అడుగు పెట్టగానే, ఒక నిండుగా ఉన్న నీళ్ల బాటిల్‌ను మంచం కింద ఒక వైపు నుంచి మరో వైపునకు గట్టిగా దొర్లించాలి.

4 / 6
ఒకవేళ మీరు దొర్లించిన వాటర్ బాటిల్ ఎటువంటి అడ్డంకి లేకుండా అవతలి వైపునకు వచ్చేస్తే, ఆ మంచం కింద ఎవరూ లేరని, అక్కడ అంతా సురక్షితంగా ఉందని మీరు క్షణాల్లో నిర్ధారించుకోవచ్చు. అలా కాకుండా, బాటిల్ మధ్యలోనే ఆగిపోయినా లేదా ఏదైనా వస్తువుకు తగిలి శబ్దం వచ్చినా అక్కడ ఏదో ముప్పు పొంచి ఉందని అర్థం చేసుకోవాలి. వెంటనే అప్రమత్తమై రూమ్ నుంచి బయటకు వచ్చేసి, హోటల్ యాజమాన్యానికి లేదా పోలీసులకు ఫిర్యాదు చేయడం మంచిది.

5 / 6
ఈ రోజుల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళల సంఖ్య బాగా పెరిగింది. అటువంటి మహిళలకు, ఒంటరి పర్యాటకులకు ఈ చిట్కా ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. రహస్య కెమెరాలు లేదా దాగి ఉన్న వ్యక్తులను గుర్తించడానికి, మన ప్రాణాలను రక్షించుకోవడానికి ఈ చిన్న అలవాటు ఎంతో సహాయపడుతుంది. ఇకపై మీరు ఎప్పుడు హోటల్ గదికి వెళ్లినా, ఈ చిన్న పని చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.

6 / 6
Follow Us