Dhanush-Mrunal Thakur: పెళ్లి చేసుకుంటారనుకుంటే ఇదేం ట్విస్ట్! ధనుష్- మృణాళ్ ఠాకూర్‌ల బ్రేకప్! కారణమదేనా?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్‌ల ప్రేమ వ్యవహారం ముగిసిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఈ జంట ప్రేమలో ఉన్నారని కొన్ని రోజుల క్రితమే పుకార్లు రాగా మృణాల్ వాటిని ఖండించింది. అయితే ఇప్పుడీ లవ్ స్టోరీకి పూర్తిగా ఎండ్ కార్డ్ పడిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ , బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉన్నారని రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. పలు సినిమా ఈవెంట్స్, ఫంక్షన్లలో వీరు జంటగా కనిపించడంతో ఈ ప్రేమ పుకార్లు నిజమేనని చాలా మంది అనుకున్నారు. 2025 ఆగస్టులో మృణాల్ నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ సినిమా ప్రీమియర్‌లో ధనుష్, మృణాల్ కలిసి కనిపించారు. దీంతో వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు మొదలయ్యాయి. ఆ తర్వాత ధనుష్ హీరోగా నటించిన ‘తేరే ఇష్క్ మే’ సినిమా పార్టీకి హాజరై కూడా మృణాల్ వార్తల్లో నిలిచింది. ఇది కాకుండా, మృణాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ధనుష్ సోదరీమణులైన డాక్టర్ కార్తీక, విమలా గీతలను కూడా ఫాలో అవ్వడం ఈ జంట ప్రేమ పుకార్లకు మరింత బలన్నిచ్చాయి. అంతేకాదు వీరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. హీరో ధనుష్ ఈ రూమర్లపై పెద్దగా స్పందించలేదు.. కానీ మృణాళ్ మాత్రం రియాక్ట్ అయ్యింది. ధనుష్ నాకు ‘కేవలం ఒక మంచి స్నేహితుడు’ మాత్రమేనని చెప్పుకొచ్చింది.
ఇక ఈ ఇద్దరికీ బాగా సన్నిహితులైన కొందరు ఇదే విషయంపై స్పందిస్తూ.. ‘అవును, వారు డేటింగ్ చేస్తున్నారనేది నిజమే. కానీ అది ప్రారంభ దశలో ఉంది. వారిద్దరికీ ఒకే రకమైన విలువలు, ఆలోచనలు ఉండడంతో కలిసి నడుద్దామనుకుంటున్నారు. కానీ వారు తమ సంబంధాన్ని అధికారికం చేయడానికి ఇష్టపడటం లేదు’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో, వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త పెద్ద సంచలనం సృష్టించింది. సాంప్రదాయ దక్షిణ భారత వివాహ వస్త్రధారణలో ఉన్న ధనుష్-మృణాల్‌ల ‘ఏఐ’ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత, ఇది ఒక తప్పుడు పుకారు అని సినీ పరిశ్రమ వర్గాలు స్పష్టం చేశాయి.
అయితే ఇప్పుడు ఫిల్మ్‌ఫేర్ నివేదిక ప్రకారం ధనుష్, మృణాల్ విడిపోయినట్లు సమాచారం. అయితే ఈ స్టార్ జంట విడిపోవడానికి గల కారణాలేవీ తెలియడం లేదని ఫిల్మ్ ఫేర్ పేర్కొంది. ఇదిలా ఉంటే.. బ్రేకప్ వార్తల గురించి అటు మృణాల్, ఇటు ధనుష్‌లు ఇప్పటి వరకు స్పందించలేదు.
ధనుష్ గతంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ను వివాహం చేసుకున్నారు. 18 ఏళ్ల పాటు వివాహ బంధంలో ఉన్న ఈ జంట, 2022లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




