AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాలు, ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో ఆదివారం వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. విదర్భ నుంచి ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతున్న ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏపీలోని బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వర్షాల అవకాశాలు ఎక్కువగా ఉండగా, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

వర్షాలు, ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో ఆదివారం వెదర్ రిపోర్ట్
Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: Jun 21, 2026 | 8:10 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. ఎండలతోపాటు.. వర్షాలు కురుస్తున్నాయి.. రుతుపవనాలు విస్తరించినప్పటికీ పెద్దగా వర్షాలు మాత్రం కురవడం లేదు.. ఈ క్రమంలోనే శనివారం నుంచి వాతావరణం మారిపోయింది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది.. ఈ క్రమంలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. విదర్భ, ఛత్తీస్‌గఢ్ మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతోందని APSDMA MD ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదివారం బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఏపీలో రెయిన్ అలర్ట్..

రాగల మూడు గంటలు పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక చేశారు. పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మచిలీపట్నం, ఏలూరు, నర్సాపూరం, దివిసీమ, గుడివాడ, భీమడోలు పరిసర ప్రాంతాల్లో పిడుగుపాటు హెచ్చరిక జారీ చేశారు. ఉరుములు, పిడుగులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు.

తెలంగాణలో వర్షాలు..

తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ సహా.. కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే.. ఉత్తర, తూర్పు తెలంగాణాలోని కొన్ని జిల్లాలలో ఈరోజు రేపు వడగాల్పుల కొనసాగే అవకాశం ఉంది.

హైదరాబాద్ సిటీలో వర్షం

హైదరాబాద్ సిటీలో వర్షం దంచికొట్టింది. శనివారం సాయంత్రం వరకూ కూడా మాములుగానే ఉన్న వాతావరణం రాత్రి 8 గంటల తర్వాత పూర్తిగా మారిపోయింది. ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. చిరు జల్లులు కాస్తా భారీ వర్షంగా మారింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో భారీ వర్షం కురిసింది. హిమాయత్ నగర్, నారాయణగూడ, బషీర్ బాగ్, అబిడ్స్, కోఠి, SR నగర్, అమీర్ పేట్ పరిసరాల్లో వర్షం కుండపోతగా కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. IDPL, చింతల్, షాపూర్ నగర్, సూరారం, బహుదూర్ పల్లి, జీడిమెట్ల, గాజులరామారంలో భారీ వర్షం కురుస్తుండటంతో ఫుల్ ట్రాఫిక్ జాం అయింది.

ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని APSDMA MD ప్రఖర్ జైన్ సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు,శ్రామికులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
NEET అలర్ట్.. డ్రెస్ కోడ్ నుంచి ID కార్డు వరకు ఇవి తెలుసుకోండి
NEET అలర్ట్.. డ్రెస్ కోడ్ నుంచి ID కార్డు వరకు ఇవి తెలుసుకోండి
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకంటే?
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకంటే?
‘మా ఇంటి బంగారం’ మూవీని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
‘మా ఇంటి బంగారం’ మూవీని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
మాంసం కూరలను తలదన్నే వంకాయ కర్రీ.. చెట్టినాడు స్టైల్‌లో
మాంసం కూరలను తలదన్నే వంకాయ కర్రీ.. చెట్టినాడు స్టైల్‌లో
తక్కువ ధరకే రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ బైక్.. చూస్తే షాకే
తక్కువ ధరకే రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ బైక్.. చూస్తే షాకే
సిగ్నల్‌ కట్ కావడాన్ని లైట్‌గా తీసుకుంటే అకౌంట్ ఖాళీ
సిగ్నల్‌ కట్ కావడాన్ని లైట్‌గా తీసుకుంటే అకౌంట్ ఖాళీ
కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న మా ఇంటి బంగారం
కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న మా ఇంటి బంగారం