AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maa Inti Bangaram: సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆ ఒక్క కారణంతో..

స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజుల తర్వాత నటించిన సినిమా 'మా ఇంటి బంగారం'. నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ శుక్రవారం (జూన్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆటతోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

Maa Inti Bangaram: సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆ ఒక్క కారణంతో..
Maa Inti Bangaram Movie
Basha Shek
|

Updated on: Jun 21, 2026 | 7:55 AM

Share

స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజుల తర్వాత ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం (జూన్ 19) థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. అంతే కాదు మొదటి రోజే ఏకంగా రూ. 13 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. నందిని రెడ్డి తెరకెక్కించిన మా ఇంటి బంగారం సినిమాలో సమంతతో పాటు శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, చైతన్య కృష్ణ, శ్రీలక్ష్మి, గౌతమి, వెన్నెల కిశోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఎంత మంది ఉన్నా ఈ సినిమాలో సమంతనే హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా యాక్షన్ సీక్వెన్స్ లోనూ సామ్ అదరగొట్టింది. సమంత కోసమే చాలా మంది ఆడియెన్స్ ఈ సినిమాకు వస్తున్నారంటే అతి శయోక్తి కాదు. విడాకులు, మయోసైటిస్.. ఇలా పర్సనల్ లైఫ్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్న సామ్ కు ఇది గ్రేట్ కమ్ బ్యాక్ మూవీ అని చెబుతున్నారు. అయితే ఈ మా ఇంటి బంగారం సినిమాకు సంబంధించి ఒక విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గామారింది. అదేంటంటే.. మా ఇంటి బంగారం సినిమాలో హీరోయిన్‌ గా ఫస్ట్ సమంతను అనుకోలేదు. న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవిని ఈ మూవీలో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట. రిలీజ్ కు ముందు ఈ సినిమా ప్రమోషన్లలో సమంతనే స్వయంగా ఈ విషయం వెల్లడించింది.

‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ( సమంత ప్రొడక్షన్ బ్యానర్) ప్రారంభించినప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలను ఎంకరేజ్ చేద్దామనే ఆలోచనతో ముందుకు వచ్చాం. అందులో భాగంగానే ‘మా ఇంటి బంగారం’ కథను మొదట సాయిపల్లవికి చెప్పాలనుకున్నాం. ఎలాగైనా ఆమెతోనే ఈ సినిమా చేయాలని ప్లాన్ చేశాం. పైగా సాయి పల్లవి నటనకు నేను పెద్ద అభిమానిని. నా బ్యానర్‌లో ఆమె హీరోయిన్‌గా నటిస్తే చాలా బాగుంటుందని అనుకున్నాను. అయితే ఆ సమయంలో సాయిపల్లవి వరుస సినిమాలతో బిజీగా ఉంది. నా సినిమా కోసం డేట్స్ కుదరలేదు. దీంతో మేం పునరాలోచనలో పడ్డాం. అయితే ఈ కథను పూర్తిగా పక్కన పెట్టకుండా.. దానిని నాకు సరిపోయేలా మార్చి నేనే హీరోయిన్ గా నటించాలని నిర్ణయించుకున్నాను. సాయిపల్లవి చేయలేకపోవడంతో కథలో కొన్ని మార్పులు చేసి నా ఇమేజ్‌కు తగ్గట్టుగా తీర్చిదిద్దారు’ అని సామ్ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

సామ్ సినిమాకు భారీ కలెక్షన్లు..

ఇక మా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే.. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us