బాలకృష్ణతో బాలీవుడ్ బ్యూటీ స్పెషల్  సాంగ్.. తెలుగులోకి గ్లామర్ గర్ల్

Rajitha Chanti

Pic credit - Instagram

20 Jun 2026

నందమూరి నటసింహం బాలకృష్ణ ,మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'NBK 111'. వీరిద్దరి కాంబోలో ఇదివరకు ఎన్నో చిత్రాలు వచ్చాయి.

'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో, దీనిపై ప్రేక్షకుల్లో , నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఒక ప్రత్యేకమైన మాస్ స్పెషల్ సాంగ్ ఉండబోతోందని.. ఇందులో బాలీవుడ్ పాపులర్ హీరోయిన్ కనిపించనుందని నెట్టింట టాక్ వినిపిస్తుంది.

ఈ పాట కోసం బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీని చిత్ర బృందం ఎంపిక చేసిందని సమాచారం. 'రాక్‌స్టార్' చిత్రంతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ

ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్‌తో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రత్యేక పాటను అత్యంత భారీగా చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

ఇందుకోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ లేదా అంతటి భారీ సౌకర్యాలున్న ప్రాంతంలో ప్రత్యేక సెట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 

ఈ పాట బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.ఈ చిత్రంలో నటీనటుల ఎంపికలోనూ పలు ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.