Nani: తన మొదటి లవ్ స్టోరీ గురించి తెలిపిన నాని.. నేచురల్ స్టార్ ప్రజెంట్ క్రష్ ఎవరంటే..
ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తొలి సినిమాతోనే నాని తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాలో నాని నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆతర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే దసరా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాని. ఇక ఇప్పుడు హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

నేచురల్ స్టార్ నాని అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా ఎదిగి సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు అష్ట చమ్మ సినిమాతో హీరోగా పరిచయం అయిన నాని ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తొలి సినిమాతోనే నాని తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాలో నాని నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆతర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే దసరా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాని. ఇక ఇప్పుడు హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ.. తన మొదటి లవ్ స్టోరీ గురించి తెలిపాడు. హాయ్ నాన్న మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాని రేడియో జాకీలతో చిట్ చాట్ చేశారు.
View this post on Instagram
తాను మూడో తరగతిలోనే ప్రేమలో పడ్డాను అని తెలిపాడు నాని. నాకు ప్రేమంటే ఎప్పుడో తెలిసింది. నా మూడో తరగతిలో ఓ అమ్మాయిని ఇష్టపడ్డాను అని తెలిపాడు. చిన్నప్పుడు ఫ్యాన్సీ డ్రస్ కాంపిటేషన్ లో మంచి డ్రస్ వేసుకుంది. నేనేమో ఆకులు చుట్టుకొని నిలుచున్నాను అని తెలిపాడు నాని. ఇప్పుడు నేను మా నుంచి డ్రస్ వేసుకున్నా కాబట్టి ఆ అమ్మాయి ఇప్పుడు కనిపిస్తే వెళ్లి వెంటనే పలకరిస్తా అని అన్నారు నాని. మరి ప్రజెంట్ క్రష్ ఎవరు అని అడగ్గా.. కియారా కన్నా అని తెలిపాడు. కియారా ఖన్నా హాయ్ నాన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తోంది. ఆ చిన్నారి ఈ సినిమాలో నాని కూతురిగా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ ఉంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ , మొదటి సాంగ్ ప్రేక్షకులను మెప్పించాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.