Chiyaan Vikram: ఏడేళ్ల తర్వాత విడుదలకు రెడీ అయిన విక్రమ్ సినిమా.. ఏ మూవీనంటే
విక్రమ్ హిట్లు ఫ్లాప్ లతో సంబందం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రయోగాలకు విక్రమ్ ఎప్పుడు ముందుంటాడు. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకుల ఉండును వచ్చాడు. పొన్నియన్ సెల్వన్ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పొన్నియన్ సినిమాలో ఆదిత్య కారికలాన్ గా నటించి మెప్పించాడు విక్రమ్. ఇదిలా ఉంటే ఇప్పుడు దాదాపు ఏడేళ్ల తర్వాత విక్రమ్ నటించిన సినిమా రిలీజ్ కానుంది.

చియాన్ విక్రమ్ సినిమాలకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ్ లో విక్రమ్ నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా విక్రమ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్స్ లో వచ్చిన అపరిచితుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత విక్రమ్ సినిమాలన్నీ తెలుగులోకి డబ్ అయ్యాయి. విక్రమ్ హిట్లు ఫ్లాప్ లతో సంబందం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రయోగాలకు విక్రమ్ ఎప్పుడు ముందుంటాడు. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకుల ఉండును వచ్చాడు. పొన్నియన్ సెల్వన్ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పొన్నియన్ సినిమాలో ఆదిత్య కారికలాన్ గా నటించి మెప్పించాడు విక్రమ్. ఇదిలా ఉంటే ఇప్పుడు దాదాపు ఏడేళ్ల తర్వాత విక్రమ్ నటించిన సినిమా రిలీజ్ కానుంది.
విక్రమ్ హీరోగా తెరకెక్కిన సినిమా ధ్రువ నక్షత్రం. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ రీతువర్మ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, రాధికశరత్ కుమార్. వంశీ కృష్ణ, ప్రియదర్శిని కీలక పాత్రల్లో నటించించారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు రిలీజ్ డేట్స్ వాయిదా పడుతూ వస్తుంది.
View this post on Instagram
ధ్రువ నక్షత్రం సినిమా షూటింగ్ పూర్తి దాదాపు 7 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు విక్రమ్ ఫ్యాన్స్. దీపావళి కానుకగా ఈ సినిమాను సెప్టెంబర్ 24న విడుదల కానుంది. ఈ సినిమాకు హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిందని తెలుస్తోంది. మరి ఎంతకాలం రిలీజ్ విషయంలో జాప్యం జరుగుతూ వచ్చిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాను తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు విక్రమ్ ఫ్యాన్స్.
View this post on Instagram
విక్రమ్ ఇన్ స్టార్ గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.