Varudu Kaavalenu : ‘వరుడు కావలెను’ షూటింగ్‌‌‌‌కు గుమ్మడికాయ కొట్టిన నాగ శౌర్య..

యంగ్ హీరో నాగశౌర్య జోరు పెంచాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్న శౌర్య.. శరవేగంగా ఆయా సినిమాల షూటింగ్‌‌‌ను కంప్లీట్..

Varudu Kaavalenu : 'వరుడు కావలెను' షూటింగ్‌‌‌‌కు గుమ్మడికాయ కొట్టిన నాగ శౌర్య..
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 07, 2021 | 7:36 PM

Varudu Kaavalenu : యంగ్ హీరో నాగశౌర్య జోరు పెంచాడు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తున్న శౌర్య.. శరవేగంగా ఆయా సినిమాల షూటింగ్‌‌ను కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌‌‌లో రూపొందుతున్న ఈ సినిమాకు లక్ష్య అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌‌‌‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలానే శౌర్య తన హోమ్ బ్యానర్‌‌‌‌లో అనీష్ కృష్ణతో చేస్తున్న తన 22వ ప్రాజెక్ట్ షూట్‌‌‌లో పాల్గొంటున్నాడు. వీటితోపాటు లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య డైరెక్షన్‌‌‌‌లో వరుడు కావలెను అనే సినిమా చేస్తున్నాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్‌‌‌గా తెలుగమ్మాయి రీతువర్మ నటిస్తుంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్‌‌‌ను పూర్తి చేశాడు నాగశౌర్య. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా లొకేషన్‌‌‌లో డైరెక్టర్‌‌‌తో హీరోహీరోయిన్లు కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేశారు. ‘మీ హృదయాలను ప్రేమ- భావోద్వేగాలతో నింపడానికి త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాం’అంటూ మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాలో నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్, హర్ష వర్ధన్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

 Aadi Sai Kumar’s Black Movie: తొలిసారిగా పోలీస్ గెటప్‌‌‌లో ఆది సాయి కుమార్.. ఆకట్టుకుంటున్న బ్లాక్ టీజర్

Kannada Actress Ashika Ranganath: పట్టుపరికినిలో బుట్టబొమ్మ .. చందమామే చిన్నబోయే సొగసైన చిన్నది..

Evaru Meelo Koteeswarulu : ‘ఇక్క‌డ మనీతో పాటు మ‌న‌సులు కూడా గెలుచుకోవ‌చ్చు’ అంటున్న తారక్