AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadi Sai Kumar’s Black Movie: తొలిసారిగా పోలీస్ గెటప్‌‌‌లో ఆది సాయి కుమార్.. ఆకట్టుకుంటున్న బ్లాక్ టీజర్

సాలిడ్ హిట్ కోసం యంగ్ హీరో ఆది సాయి కుమార్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు. ప్రేమ కావాలి సినిమాతో హీరోయిన్‌‌‌గా..

Aadi Sai Kumar's Black Movie: తొలిసారిగా పోలీస్ గెటప్‌‌‌లో ఆది సాయి కుమార్.. ఆకట్టుకుంటున్న బ్లాక్ టీజర్
Black
Rajeev Rayala
|

Updated on: Aug 07, 2021 | 5:03 PM

Share

Aadi Sai Kumar’s Black : సాలిడ్ హిట్ కోసం యంగ్ హీరో ఆది సాయి కుమార్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు. ప్రేమ కావాలి సినిమాతో హీరోయిన్‌‌‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో మొదటి సినిమాతో హిట్‌‌‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత లవ్లీ అనే సినిమాతో మరో విజయం సొంతం చేసుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఆది ఇప్పటివరకు ఆ రేంజ్ హిట్‌‌ను అందుకోలేకపోయారు. హిట్లు ఫ్లాప్‌‌లతో సంభందం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే బ్లాక్ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయ్యాడు. ”బ్లాక్” అనే సినిమా కోసం ఆది సాయి కుమార్ తొలిసారిగా పోలీస్ డ్రెస్ వేసుకున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా బ్లాక్ సినిమానుంచి టీజర్‌‌‌ను విడుదల చేశారు.

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు  బ్లాక్ సినిమా టీజర్‌‌‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌‌‌కు విషెస్ తెలిపారు. ‘కంటికి కనిపించని కాలయముడు.. ఊహించని కపట నేత్రంతో పద్మవ్యూహంలోకి నెట్టాడు..’ అని ఆది చెప్పే డైలాగ్‌‌‌తో టీజర్ ప్రారంభం అయ్యింది. ‘కాలసర్పంలా దూసుకొస్తున్న సమస్యల నుంచి బయటకు రావడానికి దారి కోసం వెతుకుతున్నా.. విధి ఆడిన వింత నాటకంలో శత్రువు కనిపించడు.. మరి నేను వెతుకున్న ప్రశ్నలకు సమాధానం ఎవరు?’ అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. మొత్తానికి టీజర్ సినిమా పై అంచనాలను క్రియేట్ చేసింది. ఆది సరసన దర్శన బానిక్ హీరోయిన్‌‌‌గా నటిస్తోంది. జిబి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న ఈ సినిమాను మహంకాళి మూవీస్ బ్యానర్ పై మహంకాళి దివాకర్ నిర్మిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

హైదరాబాద్‌‌‌లో షూటింగ్ జరుపుకుంటున్న మణిరత్నం డ్రీమ్‌‌‌‌ప్రాజెక్ట్.. రెండు వందలమంది డ్యాన్సర్లతో..

Raj Kundra Case: అందుకే అన్యాయంగా పోర్న్ కేసు పెట్టారు.. ముంబై పోలీసులపై గెహనా ఆరోపణలు

Bell Bottom : బాలీవుడ్‌‌‌‌లో మరో రచ్చ.. ఈసారి అక్షయ్ సినిమా పోస్టర్ పై ట్రోల్స్..