Bell Bottom : బాలీవుడ్‌‌‌‌లో మరో రచ్చ.. ఈసారి అక్షయ్ సినిమా పోస్టర్ పై ట్రోల్స్..

బాలీవుడ్‌‌‌లో ఇప్పటికే అల్లకల్లోలంగా ఉంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది.

Bell Bottom : బాలీవుడ్‌‌‌‌లో మరో రచ్చ.. ఈసారి అక్షయ్ సినిమా పోస్టర్ పై ట్రోల్స్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 07, 2021 | 3:47 PM

Bell Bottom : బాలీవుడ్‌‌‌లో ఇప్పటికే అల్లకల్లోలంగా ఉంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పటికే శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యవహారం వేడివేడిగా సాగుతుంది. రాజ్ కుంద్రాకు సంబంధించిన ఒక్కొక్క చీకటి వ్యవహారం బయటకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాపీ క్యాట్ వివాదం తెరపైకి వచ్చింది. అక్షయ్ కుమార్ సినిమా పోస్టర్ కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. అక్షయ్ కుమార్ – వాణి కపూర్ జంటగా నటిస్తున్న సినిమా `బెల్ బాటమ్`. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. రన్నింగ్ ట్రైన్‌‌‌‌లో అక్షయ్- వాణి వేలాడుతున్న పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌‌‌ను శ్రీలంక నుండి వచ్చిన ట్రావెల్ బ్లాగర్ వైరల్ పిక్చర్ నుండి  కాపీ చేసారని విమర్శలు వినిపిస్తోన్నాయి. కెమిల్లె – జీన్ జంటపై శ్రీలంక పర్యటనలో క్లిక్ మన్న ఫోటోను కాపీ చేశారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గతంలో ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా పోస్టర్ కూడా ఈ సినిమా ఫోటోనుంచే కాపీ చేశారని ట్రోల్స్ జరిగాయి. 12బెల్ బాటమ్ చిత్రానికి రంజిత్ ఎం తివారీ దర్శకత్వం వహించారు ఆగష్టు 19న 3డిలో థియేటర్లలో విడుదల కానుంది. వషు భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్‌శిక్షా దేశ్‌ముఖ్‌, మోనిషా అద్వానీ, మధు బోజ్వానీ, నిఖిల్‌ అద్వానీ  ఈ సినిమాను నిర్మించారు. లారాదత్తా, హూమాఖురేషి ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం 1980 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. ఈ సినిమాలో అక్షయ్ రా ఏజంట్ గా కనిపించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

 Kajol: స్టార్ హీరోయిన్ అయితే ఇంత పొగరా ? కాజోల్ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు…

MAA Elections 2021: ‘మా’ ఎన్నికలలో ట్విస్ట్.. అధ్యక్షుడు నరేష్ పై నటి హేమ సంచలన వ్యాఖ్యలు..

Ban Netflix: కొంపముంచిన మణిరత్నం ‘నవరస’ వెబ్ సిరీస్.. నెట్‏ఫ్లిక్స్ బ్యాన్ చేయాలంటూ నెట్టింట్లో రచ్చ..

Yo Yo Honey Singh: గృహహింస కేసుపై స్పందించిన యోయో హనీ సింగ్.. భార్యపై సంచలన కామెంట్స్..