AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAA Elections 2021: ‘మా’ ఎన్నికలలో ట్విస్ట్.. అధ్యక్షుడు నరేష్ పై నటి హేమ సంచలన వ్యాఖ్యలు..

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజు రోజుకు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడకముందే..

MAA Elections 2021: 'మా' ఎన్నికలలో ట్విస్ట్.. అధ్యక్షుడు నరేష్ పై నటి హేమ సంచలన వ్యాఖ్యలు..
Hema
Rajitha Chanti
|

Updated on: Aug 07, 2021 | 11:57 AM

Share

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజు రోజుకు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడకముందే.. ఆరోపణలు, ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పలువురు నటీనటులకు సంబంధించిన బృందాలు ఆరోపణలు చేసుకుంటుండగా.. ప్రెస్ మీట్స్‏లో మా అసోసియేషన్ ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా.. లోకల్, నాన్ లోకల్ అనే వాదన వినిపించినా.. ఆ తర్వాత ఎన్నికలు లేవు ఏకగ్రీవమే అని పెద్దలు చెప్పుకొచ్చారు. దీంతో ఎన్నికలు నిర్వహించాల్సిందేనని పోటీలో ఉన్న అభ్యర్థులు పట్టుబట్టారు. ఇదిలా ఉంటే..మొన్న మా ఎన్నికలపై మంచు విష్ణు ఆసక్తికర కామెంట్స్ చేయగా.. ఇటీవల ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ మరో చర్చకు దారి తీసింది. మా ఎన్నికలలో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్, హేమ, జీవిత రాజశేఖర్, నటుడు సీవీఎల్ నరసింహా రావు వంటి వారు పోటీ చేస్తున్నా.. పోటీ మాత్రం మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ మధ్యే కనిపిస్తుంది. ఇక మిగత అభ్యర్థుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్‏డేట్ రావడం లేదు. ఈక్రమంలోనే తాజాగా నటి హేమ తెరపైకి వచ్చారు.

మా ఎన్నికలు, అధ్యక్షుడు గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. తన బృందంలోని సభ్యులందరికీ వాయిస్ మేసేజ్‏లు పంపారు. ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా.. వెంటనే జరపాలంటూ మా పెద్దలకు లేఖలు రాసేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అలాగే మా అధ్యక్షుడిగా ఉన్న నరేష్.. ఇంతవరకు మా కోసం రూపాయి సంపాదించలేదని.. ఉన్న డబ్బులే ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. హేమ వాయిస్‏లో.. హాయ్ అండి.. ఈ మెసేజ్ నేను ఒక్కక్కరికీ కాకుండా కామన్‌గా చెప్పేస్తున్నాను. 200 నుంచి 250 మందికి లెటర్ పంపిస్తున్నాను. ఏం లేదు మా ఎలక్షన్స్ పెట్టకూడదు. నరేష్‌గారే ప్రెసిడెంట్‌గా కొనసాగాలని చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత వరకు మా అసోషియేషన్ ఒక్క రూపాయి సంపాదించింది లేదు కానీ.. నరేష్ గారు మొత్తం ఉన్న రూ. 5కోట్లలో రూ. 3 కోట్లు ఖర్చు పెట్టేశారు. పోయినసారి మెడికల్ క్లైమ్‌కి, రాబోయే మెడికల్ క్లైమ్‌కి కలిపి మొత్తం రెండున్నర కోట్లకు పైగా ఖర్చు అయినట్లు లెక్క. ఆఫీస్ ఖర్చులు అవీ, ఇవీ కలిపి దాదాపు అంతే అవుతుంది. గతంలో ఆఫీస్ ఖర్చులు బయటి నుంచి తీసుకువచ్చి ఇచ్చే వాళ్లం. ఇప్పుడాయన హాయిగా కూర్చుని మన అకౌంట్‌లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు. ఇప్పుడాయన ఆ కుర్చీ దిగకూడదు… ఎలక్షన్స్ జరగకూడదు అని ప్లాన్స్ వేస్తున్నారు. కాబట్టే మనం ఎలక్షన్స్ కావాలి అని సంతకాల చేయాలి. నేను మనిషిని పంపిస్తాను. సంతకాలు చేసి ఇవ్వండి.. నేను మా అసోసియేషన్‏కు సబ్మిట్ చేస్తా.. ఈ సంవత్సరం మెడికల్ క్లైమ్.. అవి, ఇవీ కట్టేస్తే.. నెక్ట్స్ సంవత్సరం పెన్షన్లు ఇచ్చుకోవడానికి మన దగ్గర డబ్బులు మిగలవు. అందుకే మనకు ఎన్నికలు కావాలి అని సంతకాలు పెట్టండి అంటూ హేమ వాయిస్ మెసేజ్ పంపింది.

నరేష్ ఇప్పటివరకు మా అసోసియేషన్ కోసం ఏమి సంపాదించలేదని..తమ ఖాతాలలో ఉన్న డబ్బులు ఖర్చు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ కోసం ప్రచారం చేయడం లేదని తెలిపారు.

Also Read: