AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yo Yo Honey Singh: గృహహింస కేసుపై స్పందించిన యోయో హనీ సింగ్.. భార్యపై సంచలన కామెంట్స్..

ప్రముఖ బాలీవుడ్ సింగర్ యోయో హనీ సింగ్ తనను వేధిస్తు్న్నాడంటూ ఆయన భార్య షాలిని తల్వార్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Yo Yo Honey Singh: గృహహింస కేసుపై స్పందించిన యోయో హనీ సింగ్.. భార్యపై సంచలన కామెంట్స్..
Yo Yo Honey Singh
Rajitha Chanti
|

Updated on: Aug 07, 2021 | 9:01 AM

Share

ప్రముఖ బాలీవుడ్ సింగర్ యోయో హనీ సింగ్ తనను వేధిస్తున్నాడంటూ ఆయన భార్య షాలిని తల్వార్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. యోయో హనీ సింగ్‏కు చాలా మంది మహిళలో అక్రమ సంబంధం ఉందని.. అలాగే తనను తన భర్తతోపాటు.. అతని తల్లిదండ్రులు, సోదరి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ షాలిని తల్వర్ ఆరోపించింది. అయితే తాజాగా యోయో హానీ సింగ్ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించాడు. తన భార్య షాలిని తల్వార్ తనపై చేసిన ఆరోపణలను ఖండించాడు. తనపై వస్తున్న ఆరోపణలతో తీవ్రంగా బాధపడ్డానని తెలిపాడు. ఈ మేరకు తన ఇన్‏స్టా ఖాతాలో సుధీర్ఘ పోస్ట్ చేశాడు.

“నా భార్య షాలిని తల్వార్ నాపై, నా కుటుంబంపై చేస్తున్న అసత్య , హానికరమైన ఆరోపణలతో నేను చాలా బాధపడ్డాను. ఆమె చేసిన వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయి. నా ఆరోగ్యంపై, నా పాటలపై వస్తున్న రూమర్స్ పై నేను ఎప్పుడూ స్పందించలేదు. నాపై వ్యతిరేక ప్రచారం వచ్చినా నేనెప్పుడు ప్రెస్ నోట్ జారీ చేయలేదు. కానీ ఈసారి నాపై వచ్చిన ఆరోపణలపై నేను మౌనంగా ఉండలేను. ఎందుకంటే.. ఈ మాటలు నన్ను, నా కుటుంబాన్ని నా చెల్లిపై చేస్తున్నారు. వారు నాకు కష్ట సమయాల్లో ఎంతో అండగా ఉన్నారు. ఈ ఆరోపణలు మా పరువుకు భంగం కలిగించేవిగా ఉన్నాయి. ”

నేను 15 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమలో ఉన్నాను. దేశవ్యాప్తంగా కళాకారులు, సంగీతకారులతో పనిచేశాను. నా భార్యతో నేను ఎలా ఉంటాను అనేది నా సిబ్బందికి తెలుసు. తనను నా షూటింగ్స్, ఈవెంట్స్, సమావేశాలకు ఆమెను తీసుకుని వెళ్లేవాడిని.. ఆమె చేసిన ఆరోపణలలో నిజం లేదు. నాకు దేశ న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. నిజం తొందర్లోనే బయటపడుతుంది అని తెలిపారు.

ట్వీట్..

Also Read: Bigg Boss: బిగ్‏బాస్‏లోకి మరో అందాల తార.. తెరపైకి జాంబిరెడ్డి బ్యూటీ..

Mahesh Babu: మహేష్ అభిమానులకు సర్‏ప్రైజ్ ఇచ్చిన థమన్.. సూపర్ స్టార్ పక్కనే విజయ్.. అదుర్స్ అంటున్న నెటిజన్లు..