Mahesh Babu: మహేష్ అభిమానులకు సర్‏ప్రైజ్ ఇచ్చిన థమన్.. సూపర్ స్టార్ పక్కనే విజయ్.. అదుర్స్ అంటున్న నెటిజన్లు..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ సినిమా సర్కారు వారి పాట.. కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తున్న

Mahesh Babu: మహేష్ అభిమానులకు సర్‏ప్రైజ్ ఇచ్చిన థమన్.. సూపర్ స్టార్ పక్కనే విజయ్.. అదుర్స్ అంటున్న నెటిజన్లు..
Mahesh
Follow us

|

Updated on: Aug 07, 2021 | 7:28 AM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ సినిమా సర్కారు వారి పాట.. కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తున్న ఈ మూవీని డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్నాడు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో మహేష్ సరికొత్త లుక్‏లో కనిపించబోతుండడంతో.. సూపర్ స్టార్‏ను స్ర్కీన్ పై చూసేందుకు అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇటీవల సర్కారు వారి పాట మూవీ నుంచి మహేష్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో కారు నుంచి దిగుతున్న మహేష్ లుక్‏కు అభిమానులు ఫిదా అయ్యారు. రిలీజ్ చేసిన గంటల్లోనే పోస్టర్ నెట్టింట్లో సంచలనం సృష్టించందంటేనే అర్థం చేసుకోవచ్చు మహేష్ మేనియా ఎలా ఉందో.

అయితే ఈ ఫోటోను అభిమానులు తమకు నచ్చిన విధంగా ఎడిట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు పక్కనే తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఉన్నట్లుగా ఎడిట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్‏కు తెలుగులోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసందే. ఇక ఇద్దరూ స్టా్ర్ హీరోలు ఒకే ఫ్రేమ్‏లో ఉండడంతో.. మ్యూచువల్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోస్ నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కంట పడింది. దీంతో థమన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇదిలా ఉంటే.. మహేష్ పుట్టిన రోజు ఆగస్ట్ 9న సందర్భంగా బ్లస్టర్ అప్ డేట్ రానున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు.

ట్వీట్..

Also Read: Salaar Movie: శరవేగంగా ‘సలార్’ షూటింగ్.. నైట్ యాక్షన్ షాట్‎కు సిద్ధమైన ప్రభాస్..

SR Kalyana Mandapam: ‘ఎస్ఆర్. కళ్యాణ మండపం’ సినిమాకు ఫైరసీ ఎఫెక్ట్.. వైబ్‏సైట్‏లలో ఫుల్ మూవీ..

Shalini Pandey: చక్కనమ్మ చిక్కిన అందమే.. వైరల్ అవుతోన్న షాలిని పాండే లేటెస్ట్ ఫొటోస్..