SR Kalyana Mandapam: ‘ఎస్ఆర్. కళ్యాణ మండపం’ సినిమాకు ఫైరసీ ఎఫెక్ట్.. వైబ్‏సైట్‏లలో ఫుల్ మూవీ..

కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై ఎక్కువగా ప్రభావం చూపింది. ఆర్థికంగా సినీ రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బకొట్టింది. ఫస్ట్ వేవ్, సెకండ్

SR Kalyana Mandapam: 'ఎస్ఆర్. కళ్యాణ మండపం' సినిమాకు ఫైరసీ ఎఫెక్ట్.. వైబ్‏సైట్‏లలో ఫుల్ మూవీ..
Sr Kalyana Mandapam
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 07, 2021 | 6:41 AM

కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై ఎక్కువగా ప్రభావం చూపింది. ఆర్థికంగా సినీ రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బకొట్టింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ప్రభావాలతో థియేటర్లు మూతపడడం, షూటింగ్స్ నిలిచిపోవడంతో దర్శక నిర్మాతలకు భారీగా నష్టాన్ని చేకూర్చడమే కాకుండా.. ఎంతో మంది సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. సెకండ్ వేవ్ అనంతరం ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుంటుండగా… సినిమాలను విడుదల చేసే పనిలో పడ్డారు మేకర్స్. ఇటీవల సత్యేదేవ్ నటించిన తిమ్మరుసు చిత్రం థియేటర్లలో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. తాజాగా డైరెక్టర్ శ్రీధర్ గాదె తెరకెక్కించిన ఎస్ఆర్. కళ్యాణ మండపం సినిమా నిన్న ప్రేక్షకలు ముందుకు వచ్చింది.

‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ఫస్ట్ మూవీతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం. తాజాగా ఈ యంగ్ హీరో ఎస్ఆర్. కళ్యాణ మండపం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో సీనియర్ హీరో సాయి కుమార్ కీలక పాత్రలో నటించగా.. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‏గా నటించింది. చిన్న సినిమాగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మొదటి షోతోనే మంచి టాక్ సొంతం చేసుకుంది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రాన్ని పైరసీ భూతం వెంటాడింది. నిన్న ఉదయం సినిమా విడుదల కాగా.. సాయంత్రానికి పలు వెబ్ సైట్లలో ఈ సినిమా పైరసీ ప్రింట్ వచ్చేసింది. దాదాపు 650 థియేటర్లలో ఈ సినిమా విడుదల కాగా.. పాజిటివ్ టాక్ అందుకుంది. కరోనా ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన సినీ పరిశ్రమకు పైరసీ భూతం మరింత నష్టాన్ని చేకూర్చనుంది.

Also Read: Nithiin’s Maestro : వెన్నెల్లో ఆడపిల్ల అంటూ విరహగీతం ఆలపిస్తున్న నితిన్.. మ్యాస్ట్రో నుంచి మరో అందమైన పాట..

Keerthy Suresh : మెగాస్టార్ సిస్టర్‌‌‌‌గా మహేష్ హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా..? ఫిలిం సర్కిల్స్‌‌‌లో జోరుగా జరుగుతున్న ప్రచారం..

Rajasekhar: విలన్‌‌‌‌గా మారనున్న సీనియర్ యాక్టర్.. ఆ హీరో సినిమాలో ప్రతినాయకుడిగా రాజశేఖర్..