Ban Netflix: కొంపముంచిన మణిరత్నం ‘నవరస’ వెబ్ సిరీస్.. నెట్‌ఫ్లిక్స్ బ్యాన్ చేయాలంటూ నెట్టింట్లో రచ్చ..
క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన నవరస వెబ్ సిరీస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. తొమ్మిది మంది దర్శకులు, తొమ్మిది
క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన నవరస వెబ్ సిరీస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. తొమ్మిది మంది దర్శకులు, తొమ్మిది మంది విలక్షణ నటులు నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. కోపం, శోకం, హాస్యం ఇలా నవరసాలకు సంబంధించిన కథలను ఇందులో చూపించారు. అయితే ఈ వెబ్ సిరీస్ చుట్టూ ఇప్పుడు వివాదాలు చెలరేగాయి. మణిరత్నం తెరకెక్కించిన నవరస వెబ్ సిరీస్ ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ను అవమానించినట్లుగా ఉందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వెబ్ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేస్తున్న నెట్‌ఫ్లిక్స్‌ను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ట్విట్టర్లో #Ban Netflix అంటూ డిమాంట్ చేస్తున్నారు.
డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ నవరస.. దక్షిణాదిలోనే అతి పెద్ద వెబ్ సిరీస్. ఇందులో తొమ్మిది విభిన్న కథలను ప్రత్యేకంగా రూపొందించాడు. ఈ సిరీస్‌లో 7వ ఎపిసోడ్ ఇన్మై స్టోరీ పోస్టర్ ద్వారా అసలు వివాదం మొదలైంది. ఈ పోస్టర్లో ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ను అవమానించినట్లుగా ఉందని పేర్కొన్నారు. ఈ సిరీస్ లేదా.. నెట్‌ఫ్లిక్స్‌ను బహిష్కరించాలని.. మతపరమైన మనోభావాలని దెబ్బతీశారని ఆరోపిస్తూ సినిమాలో నటించిన నటీనటులను కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సిరీస్ పోస్టర్‍ను తమిళ వార్త పత్రిక ముద్రించింది. దీంతో అతడిని కూడా శిక్షించాలని నెట్టింట్లో ఆగ్రహాం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై అటు డైరెక్టర్ మణిరత్నం, ఇటు నెట్ ఫ్లిక్స్ ఇంకా స్పందించలేదు. రాజా అకాడమీ అనే భారతీయ సున్నీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేసినందుకు బ్యాన్ చేయాలని ఫిర్యాదు చేసింది.
ట్వీట్స్..
Netflix has published a verse of the Quran in the advertisement of its film NavaRasa in Daily Thanthi newspaper معاز اللہ This is an insult to the Quran. We demand strict action against@NetflixIndia#BanNetflix #BanDailyThanthiNews #TahaffuzeQuran
— Raza Academy (@razaacademyho) August 6, 2021
Your creativity is my foot Stop Targeting ISLAM#BanNetflix pic.twitter.com/kM0LDdKecD
— Shahenshah Tweets (@Shahenshah_faqr) August 6, 2021
#banNetflix They are continuously targeting Different religion and the sentiment of many communities!!
Netflix should be ban ✅✅ pic.twitter.com/6oUxkcQgHe
— Junaid Ahmad (@_junaidahmad_) August 6, 2021
Also Read: Yo Yo Honey Singh: గృహహింస కేసుపై స్పందించిన యోయో హనీ సింగ్.. భార్యపై సంచలన కామెంట్స్..
Bigg Boss: బిగ్‌బాస్‌లోకి మరో అందాల తార.. తెరపైకి జాంబిరెడ్డి బ్యూటీ..