పరమ్ సుందరి అంటూ అదరగొట్టిన చిన్నారి.. కృతిసనన్‌‌‌‌ను దించేసిన క్యూటీ.. నెటిజన్లు ఫిదా అవ్వకుండా ఉంటరామరి..

ఏదైనా ఒక పాట బాగుంటే చాలు అది క్షణాల్లో వైరల్.. నిముషాల్లో ట్రేండింగ్ అయిపోతుంది. ఆపాటకు డ్యాన్స్లు వేస్తూ కొంతమంది..

పరమ్ సుందరి అంటూ అదరగొట్టిన చిన్నారి.. కృతిసనన్‌‌‌‌ను దించేసిన క్యూటీ.. నెటిజన్లు ఫిదా అవ్వకుండా ఉంటరామరి..
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 06, 2021 | 6:49 PM

ఈ మధ్యకాలంలో ఏదైనా ఒక పాట బాగుంటే చాలు అది క్షణాల్లో వైరల్.. నిముషాల్లో ట్రేండింగ్ అయిపోతుంది. ఆ పాటకు రకరకాలుగా డాన్స్‌‌‌‌‌‌లు వేస్తూ కొంతమంది.. ఒరిజినల్ సాంగ్‌‌‌‌ను కంప్యార్ చేస్తూ మరికొంతమంది డాన్స్‌‌‌‌‌‌లతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే రీసెంట్ డేస్‌లో నెట్టింట ఓ బాలీవుడ్ సాంగ్ తెగ సందడి చేస్తోంది. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్‌ సాధించి రికార్డులు క్రియేట్ చేస్తోంది. యూట్యూబ్‌లో మాత్రమే కాదు.. ఇప్పుడు ఇన్‌స్టా రీల్స్‌లో … రిపీటెడ్‌గా వైరల్ అవుతూ.. మరింతంగా ఆకట్టుకుంటోంది. ఇంతకీ అదేం సాంగ్ అని అనుకుంటున్నారా.. పరమ్‌ సుందరి సాంగ్.

“మిమీ” సినిమా కోసం ఏఆర్‌ రెహమాన్‌ కంపోజ్‌ చేసిన ఈ సాంగ్‌ను శ్రేయ గోషాల్ ఆలపించారు. అలాగే ఈ పాటకు అమితాబ్‌ భట్టాచార్యా సాహిత్యం అందించారు. అయితే ఈ సాంగ్ వినడానికే కాదు.. చూడ్డానికి కూడా కన్నుల విందుగా ఉండడంతో.. పరమ్ సుందరి ఇండస్ట్రీలో సెన్సేషన్‌‌‌‌గా మారుతోంది. గణేష్ మాస్టర్ కంపోజ్‌ చేసిన స్టెప్స్‌.. కృతి సనన్‌ వేసిన తీరు కంటికి ఇంపుగా ఉండడంతో… చూసిన వారితో కాళ్లు కదిపేలా చేస్తోంది. అయితే తాజాగా ఈ పాటకు ఓ బేబీ చేసిన డాన్స్‌‌‌‌‌‌  ఇన్‌స్టాలో వైరల్ అవుతోంది. అచ్చం కృతి సనన్‌ వేసిన స్టెప్పులనే క్యూట్ క్యూట్‌‌‌గా చేస్తూ.. అందర్నీ మెస్మరైజ్‌ చేస్తోంది. నమ్మట్లేదా.. అయితే  ఈ వీడియో పై ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss Telugu 5: భారీ రెమ్యునరేషన్‌‌‌‌తో ‘బిగ్ బాస్’5లోకి ఎంటర్ అవ్వనున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్..?

Sonu Sood : సోనుసూద్ ట్రావెల్ బిజినెస్..! ఇక వారికి ఎలాంటి సమస్య ఉండదు.. తెలుసుకోండి

Sonakshi Sinha: కుంచె పట్టిన సోయగం.. తనలోని అద్భుతమైన కళను బయటపెట్టిన అందాల భామ..