AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj Kundra Case: అందుకే అన్యాయంగా పోర్న్ కేసు పెట్టారు.. ముంబై పోలీసులపై గెహనా ఆరోపణలు

Raj Kundra Porn Case: రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా తనపై నమోదైన పోర్నోగ్రఫీ కేసుకు సంబంధించి ముంబై పోలీసులపై సినీ నటి గెహనా వశిష్ట సంచలన ఆరోపణలు చేశారు.

Raj Kundra Case: అందుకే అన్యాయంగా పోర్న్ కేసు పెట్టారు.. ముంబై పోలీసులపై గెహనా ఆరోపణలు
Actress Gehana Vasisth, Raj Kundra
Janardhan Veluru
|

Updated on: Aug 07, 2021 | 3:56 PM

Share

Raj Kundra Porn Racket Case: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసు వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా తనపై నమోదైన పోర్నోగ్రఫీ కేసుకు సంబంధించి ముంబై పోలీసులపై సినీ నటి గెహనా వశిష్ట సంచలన ఆరోపణలు చేశారు. లంచం ఇచ్చేందుకు నిరాకరించినందుకే  తన క్లైంట్ గెహనాను ముంబై పోలీసులు టార్గెట్ చేశారని ఆమె తరఫు న్యాయవాది ఆరోపించారు. అలాగే పోర్నోగ్రఫీ కేసు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రాకు అండగా నిలిచినందుకే పోలీసులు ఆమెపై అన్యాయంగా పోర్న్ కేసు పెట్టారంటూ గెహనా తరఫు న్యాయవాది సునీల్ కుమార్ బాంబే హైకోర్టులో వాదనలు వినిపించారు. పోర్న్ కేసులో గెహనాపై ముంబై క్రైమ్ బ్రాంచ్‌లో ఎఫ్ఐఆర్ నమోదుచేసిన నేపథ్యంలో.. తన క్లైంట్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. రాజ్ కుంద్రాకు చెందిన హాట్‌షాట్స్ యాప్ కోసం పోర్నోగ్రఫీ షూట్‌ చేసేలా ఓ మహిళపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు గెహనాపై ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అభిమోగాలు మోపారు.

రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసులో గెహనాను అరెస్టు చేసేందుకు వచ్చిన ముంబై పోలీసులు..ఆమెను అరెస్టు చేయకుండా ఉండేందుకు రూ.15లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు న్యాయవాది సునీల్ కుమార్ ఆరోపించారు. అయితే పోలీసులకు లంచం ఇచ్చేందుకు గెహనా నిరాకరించినట్లు చెప్పారు. దీంతో పాటు రాజ్ కుంద్రాకు గెహనా బాసటగా నిలిచారన్న కారణంతోనే పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఆమెపై కేసు పెట్టారని ఆరోపించారు.

Gehana Vasisth

Gehana Vasisth

అటు పోర్న్ షూట్‌కు ఒప్పించేందుకు తనపై గెహనా ఒత్తిడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ ప్రొఫషనల్ పోర్న్ స్టార్‌గా న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆమె పేరిట ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తే వందలాది పోర్న్ సినిమాలు దర్శనమిస్తాయన్నారు. మరి ఆమెతో పోర్న్ సినిమాలు చేసిన వారిపై ముంబై పోలీసులు ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. పోలీసులు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. పబ్లిక్ సెలబ్రిటీ అయినందుకే గెహనా వశిష్టను పోలీసులు టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు.

Also Read..

టూరిస్ట్‌ల ముసుగులో వ్యభిచారం.. ఏపీలోని పర్యాటక ప్రదేశాల్లో అసాంఘీక కార్యకలాపాలు.!

బాలీవుడ్‌‌‌‌లో మరో రచ్చ.. ఈసారి అక్షయ్ సినిమా పోస్టర్ పై ట్రోల్స్..