Adivi Sesh:పెళ్లి పై గాలి మళ్లిందంటున్న కుర్ర హీరో.. వచ్చే ఏడాది అడవి శేష్ పెళ్లిపీటలెక్కే ఛాన్స్..
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ యంగ్ హీరోల్లో అడవి శేష్ ఒకరు. ఈ కుర్ర హీరో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.
Adivi Sesh: టాలీవుడ్‌లో ఉన్న టాలెంటెడ్ యంగ్ హీరోల్లో అడవి శేష్ ఒకరు. ఈ కుర్ర హీరో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. శేష్ నటించిన క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలు మంచి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మేజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు శేష్. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న ఈ మూవీకి డైరెక్టర్ శశికిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా మూడు భాషల్లో మొత్తంగా 120 రోజుల పాటు షూటింగ్ నిర్వహించి తెరకెక్కించారు. 75 లొకేషన్లలో షూటింగ్ చేయగా.. ఎనిమిది సెట్లు ప్రత్యేకంగా నిర్మించారు. ఇందులో 26/11 దాడుల్లో ఆయన చూపించిన తెగువ, ధైర్య సాహసాలు మాత్రమే కాకుండా ఆయన జీవితంలోని ప్రతీ ఒక్క ఘటనను చూపించబోతోన్నారు. ఆయన ఏ స్ఫూర్తితో జీవించారు.. ఎలా మరణించారు అనేవి అందరినీ కట్టిపడేసేలా చూపించనున్నారు.
ఈ సినిమాతోపాటు హిట్ 2 సినిమా చేస్తున్నాడు శేష్. ఇక ఈ కుర్ర హీరో ఇటీవలే 36వ పడిలోకి అడుగు పెట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ఇంట్లో ఎప్పటినుంచో పెళ్లి చేసుకోంమని అడుగుతున్నారు. నేనే ఎదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నా అన్నారు. అలాగే కొన్నాళ్లు గట్టిగా చెప్పారు .. ఆ తరువాత తిట్టారు .. ఇక వీడికి చెప్పడం వేస్ట్ అని వదిలేశారు. కానీ నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నాకు పెళ్లిపై గాలి మళ్లింది అన్నారు శేష్. నాకంటూ ఒక వ్యక్తిగత జీవితం ఉండాలి కదా అనిపిస్తోంది అని అన్నారు. దాంతో వచ్చే ఏడాది అడవి శేష్ పెళ్లి అయ్యే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :