Tollywood: చిరునవ్వే ఆమె కోసం పుట్టిందనిపిస్తోంది.. ఈ ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి..
ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్ని హిట్స్. కానీ ఈ అమ్మడుకు అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. దీంతో కొద్ది రోజులుగా ఈ హీరోయిన్ సినిమాలకు దూరంగా ఉంటుంది. ఎవరో గుర్తుపట్టండి. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అమ్మాయి.
మత్తెక్కించే కళ్లు.. మైమరపించే సొగసు ఆమె సొంతం. దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యనా.. లేక అందం మొత్తం అమ్మాయిగా మారిందా అన్నట్టుగా ఉంటుంది ఆమె రూపం. చంద్రబింబం లాంటి ముఖం.. చిరునవ్వుతోనే కట్టిపడేసే ధరహాసం. అందం..అంతకు మించిన టాలెంట్ ఈ ముద్దుగుమ్మ సొంతం. తెలుగు చిత్రపరిశ్రమలో చేసి తక్కువ సినిమాలే అయినా.. తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. కానీ అందమెంత ఉన్న ఈ అమ్మడుకు అదృష్టం మాత్రం కాస్త తక్కువే అని చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్ని హిట్స్. కానీ ఈ అమ్మడుకు అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. దీంతో కొద్ది రోజులుగా ఈ హీరోయిన్ సినిమాలకు దూరంగా ఉంటుంది. ఎవరో గుర్తుపట్టండి. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అమ్మాయి.
ఈ ఫోటోలోని ముద్దమందారం ఎవరో కాదు..నాని నటించిన గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్. 1994 నవంబర్ 20న చెన్నైలో జన్మించింది ప్రియాంకా. 2019లో న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కానీ ఈ సినిమా తర్వాత తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు.
ఆ తర్వాత తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన డాక్టర్ సినిమాలో మెరిసింది. ఆ తర్వాత సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈటీ చిత్రంలో నటించింది. ఇక ఇటీవల డాన్ సినిమాతో హిట్ అందుకుంది. అలాగే ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న రావణసుర చిత్రంలోనూ నటిస్తోంది ప్రియాంక. మరోవైపు సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటస్ షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.