Saindhav: వెంకటేష్‌కు జోడీగా హీరోయిన్ ఫిక్స్ అయినట్టేనా..? ఆ బ్యూటీ ఎవరంటే
ఓ వైపు సోలోగా సినిమాలు చేస్తూనే మరో వైపు మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే ఎఫ్ 3 సినిమాతో హిట్ అందుకున్న వెంకీ.. అదే విధంగా యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమాలో కీలక పాత్రలో నటించారు.
సీనియర్ హీరోలలో వెంకటేష్ గురించి అందరికి తెలిసిందే.. ఆయన ఎంచుకునే సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. యంగ్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు వెంకీ. ఓ వైపు సోలోగా సినిమాలు చేస్తూనే మరో వైపు మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే ఎఫ్ 3 సినిమాతో హిట్ అందుకున్న వెంకీ.. అదే విధంగా యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఇక ఇప్పుడు వెంకీ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకటేష్ కెరీర్‌లో 75వ సినిమాగా ఈ మూవీ రానుంది. ఈ సినిమా శైలేశ్ కొలను దర్శకత్వంలో ఉండబోతుంది. ఇటీవలే హిట్ 2 సినిమాతో శైలేష్ మంచి హిట్ అందుకున్నాడు. ఇక వెంకటేష్ సినిమాకు సైంధవ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ఈ మూవీలో వెంకీ చాలా డిఫరెంట్ గా కనిపించనున్నారు. రఫ్ లుక్ లో అదరగొట్టారు వెంకటేష్. టైటిల్ టీజర్ తోనే ఒక గొప్ప ఇంప్యాక్ట్ క్రియేట్ చేయగా సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు వెంకీ ఫ్యాన్స్. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ , టీజర్ విడుదల చేయనున్నారు.
సినిమా మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తోంది. మెడికల్ మాఫియా నేపథ్యంతో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో వెంకీ చాలా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో జర్సీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాధ్ నటిస్తుందని తెలుస్తోంది. జర్సీ సినిమాతో శ్రద్ధా శ్రీనాధ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అలాగే బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.Shraddha Srinath