AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Score: మంచి క్రెడిట్ స్కోర్ అంటే ఎంత..? మెరుగుపర్చుకునే టిప్స్ ఇవే..!

ఆర్థిక క్రమశిక్షణ అనేది ప్రతి ఒక్కరినీ ఉన్నత స్థానానికి తీసుకువెళుతుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ఆర్థిక లావాదేవీలు సక్రమంగా, సకాలంలో చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మంచి క్రెడిట్ స్కోర్ ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. ఈ మూడంకెల నంబర్ మీ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనంగా మారుతుంది. ఈ నేపథ్యంలో క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి, దాన్ని మెరుగుపర్చుకునే పద్ధతులను తెలుసుకుందాం.

Credit Score: మంచి క్రెడిట్ స్కోర్ అంటే ఎంత..? మెరుగుపర్చుకునే టిప్స్ ఇవే..!
Nikhil
|

Updated on: Jan 07, 2025 | 4:10 PM

Share

సాధారణంగా క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 మధ్యలో ఉండే మూడంకెల సంఖ్య. ఇది మీ క్రెడిట్ యోగ్యతను సూచిస్తుంది. బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అత్యంత ప్రధానంగా మారుతుంది. ఈ నంబర్ బాగుంటేనే మీమీద బ్యాంకులకు విశ్వాసం కలుగుతుంది. తక్కువ వడ్డీకి రుణాలు పొందే అవకాశం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు, బిల్లులు, క్రెడిట్ కార్డుల చెల్లింపుల ఆధారంగా క్రెడిట్ స్కోర్ ను లెక్కిస్తారు. మెరుగైన క్రెడిట్ స్కోర్ తో అనేక ఉపయోగాలు కలుగుతాయి. తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాలను పొందవచ్చు. తక్కువ సమయంలో మంజూరయ్యే అవకాశం ఉంటుంది.

బలమైన క్రెడిట్ స్కోర్ తో రుణం పొందే అవకాశాలు మెరుగవుతాయి. అవసరమైన సమయంలో రుణాలను వేగంగా పొందే అవకాశం కలుగుతుంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు అడిగిన వెంటనే రుణాన్ని మంజూరు చేస్తాయి. క్రెడిట్ స్కోర్ ను మెరుగుపర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలి. సమయానికి బిల్లులు, ఇతర చెల్లింపులు జరపాలి. ఈ కింద తెలిపిన పద్దతులు పాటించడం ద్వారా క్రెడిట్ స్కోరును మెరుగుపర్చుకోవచ్చు. క్రెడిట్ నివేదికను క్రమం తప్పకుండా సమీక్షించుకోవాలి. దానిలో ఏమైనా తేడాలు ఉండే సరిచేసుకోవాలి. సకాలంలో చెల్లింపులు జరపడం అనేది అతి ముఖ్యమైన అంశం. క్రెడిట్ స్కోర్ మెరుగుదలకు ఇదే కీలకం. ఆటోమేటిక్ చెల్లింపులను ఎంపిక చేసుకోవడం ద్వారా స్కోర్ ను మెరుగుపర్చుకోవచ్చు.

ఖర్చు అలవాట్లను అంచనా వేసుకోవాలి. దానికి అనుగుణంగా రుణాలను తీసుకోవాలి. ప్రతి నెలా సక్రమ చెల్లింపుల ద్వారా రుణభారాన్ని తగ్గించుకోవచ్చు. తరచూ రుణాల కోసం దరఖాస్తు చేసుకోకూడదు. దాని వల్ల మీరు అప్పుల కోసం ఎదురు చూస్తున్నారనే భావన కలుగుతుంది. క్రెడిట్ స్కోర్ ను మెరుగుపర్చుకోవడం కోసం క్రెడిట్ కార్డు లేదా చిన్న మొత్తంలో రుణం తీసుకోవాలి. వాటికి సక్రమంగా చెల్లింపులు జరపడం ద్వారా స్కోర్ మెరుగవుతుంది. ఆటో చెల్లింపు రిమైండర్లను సెట్ చేసుకోవాలి. దీని వల్ల సకాలంలో చెల్లింపులు జరుగుతాయి. వాయిదాలను మర్చిపోయే అవకాశం ఉండదు. సాధారణంగా 750 దాటితే మంచి క్రెడిట్ స్కోర్ గా భావిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే స్పైసీ మలై పనీర్ రెసిపీ..
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే స్పైసీ మలై పనీర్ రెసిపీ..
సూర్యకుమార్ యాదవ్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!
సూర్యకుమార్ యాదవ్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!
2026లో మిమ్మల్ని అదృష్టవంతుల్ని చేసే వాస్తు రహస్యాలు ఇవే..
2026లో మిమ్మల్ని అదృష్టవంతుల్ని చేసే వాస్తు రహస్యాలు ఇవే..
ఈ విషయంలో పురుషులకంటే స్త్రీలే 100శాతం బెటర్.. సాటి ఎవ్వరూ లేరు
ఈ విషయంలో పురుషులకంటే స్త్రీలే 100శాతం బెటర్.. సాటి ఎవ్వరూ లేరు
పోలీసులు ఆరోపణతో నేను నేరస్తుడిని అయిపోతానా? వీడియో
పోలీసులు ఆరోపణతో నేను నేరస్తుడిని అయిపోతానా? వీడియో
తండ్రి ముగ్గురు కొడుకులకు భలే బుద్ధి చెప్పిన పోలీసులు
తండ్రి ముగ్గురు కొడుకులకు భలే బుద్ధి చెప్పిన పోలీసులు
రైల్వే ట్రాక్‌పై పిచ్చివేశాలు వేస్తూ రీల్స్ తీసిన యువకుడు
రైల్వే ట్రాక్‌పై పిచ్చివేశాలు వేస్తూ రీల్స్ తీసిన యువకుడు
సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో
సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో
అక్షరాల కీర్తనలతో భక్తి పారవశ్యాన్ని చాటుకున్న చిత్రకారుడు!
అక్షరాల కీర్తనలతో భక్తి పారవశ్యాన్ని చాటుకున్న చిత్రకారుడు!
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో