Whatsapp Pay: యూజర్లందరికీ వాట్సాప్ పే సేవలు.. ఆ పరిమితి తొలగించిన ఎన్‌పీసీఐ

స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత ప్రతి పనిని చాలా సులువుగా చేసుకునే వీలు కలిగింది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలను చిటికెలో నిర్వహించుకునే అవకాశం ఏర్పడింది. ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు డిజిటల్ చెల్లింపులు చేసే అవకాశం కల్పించింది.

Whatsapp Pay: యూజర్లందరికీ వాట్సాప్ పే సేవలు.. ఆ పరిమితి తొలగించిన ఎన్‌పీసీఐ
Follow us
Srinu

|

Updated on: Jan 07, 2025 | 4:30 PM

వాట్సాప్ పే ద్వారా పేమెంట్ సేవలు అందిస్తోంది. ఇప్పుడు తాజాగా మరో శుభవార్త చెప్పింది. దీనిలో వినియోగదారుల పరిమితిని ఎత్తివేస్తూ ఎన్పీసీఐ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపింది. ఇప్పటి వరకూ పది కోట్ల మంది వినియోగదారుల వరకూ పరిమితి ఉండేది. సాధారణంగా స్మార్ట్ ఫోన్ లో ఫోన్ పే, గూగుల్ పే యాప్ నుంచి నగదు లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటాం. అదే మాదిరిగా వాట్సాప్ నుంచి డబ్బులను పంపించవచ్చు. గతంలో ఈ సేవలు కేవలం పది కోట్ల మందికి మాత్రమే అందుబాటులో ఉండేవి. తాజాగా యూజర్ల అందరూ వినియోగించుకునే అవకాశం కలిగింది. ప్రస్తుతం వాట్సాప్ ను దాదాపు 50 కోట్ల మంది వాడుతున్నారు.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తీసుకున్న తాజా నిర్ణయంతో వాట్సాప్ యూజర్లకు మరిన్ని మెరుగైన సేవలు అందనున్నాయి. వాట్సాప్ పే ద్వారా పేమెంట్ సేవలపై గతంలో ఆంక్షలు ఉండేది. 2020లో ప్రారంభ సమయంలో కేవలం ఒక మిలియన్ వినియోగదారులకు మాత్రమే అనుమతి ఉండేది. దాన్ని 2022 నాటికి వంద మిలియన్లకు పెంచారు. తాజాగా అన్ని పరిమితులను తొలగించారు. వాట్సాప్ పే ద్వారా మన కాంటాక్టు జాబితాలోని వ్యక్తులకు డబ్బులను పంపించవచ్చు, వారి నుంచి స్వీకరించవచ్చు.

ఇవి కూడా చదవండి

సేవలు పొందే విధానం

  • వాట్సాప్ పే సేవలు పొందటానికి ముందుగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ తాజా వెర్షన్ ను అప్ డేట్ చేసుకోవాలి.
  • వాట్సాప్ పే ను యాక్టివేట్ చేసుకోవడానికి మన బ్యాంకు ఖాతాకు లింక్ చేసిన ఫోన్ నంబర్ చాలా అవసరం.
  • ముందుగా వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేయాలి. స్క్రీన్ పైన కూడి వైపు కార్నర్ లో కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి.
  • అనంతరం పేమెంట్ పై క్లిక్ చేసి, పేమెంట్ మోడ్ ను ఎంపిక చేసుకోవాలి.
  • మీ బ్యాంకు పేరును నమోదు చేయాలి. దానికి లింక్ చేసిన మొబైల్ నంబర్ తో వెరిఫై చేయాలి.
  • అనంతరం వాట్సాప్ పేమెంట్ సెటప్ చేయాలి, దీని కోసం యూపీఐ పిన్ నంబర్ ఏర్పాటు చేసుకోవాలి.

పేమెంట్ చేయాలంటే

  • వాట్సాప్ ద్వారా చాలా సులభంగా పేమెంట్ చేయవచ్చు. ముందుగా వాట్సాప్ ను ఓపెన్ చేయాలి.
  • అందులోని పేమెంట్స్ అనే దానిపై క్లిక్ చేయాలి.
  • మీరు డబ్బులు పంపాలనుకుంటున్న వ్యక్తి కాంటాక్ట్ ను ఎంపిక చేసుకోవాలి.
  • మీరు పంపాలనుకుంటున్న నగదు మొత్తాన్ని నమోదు చేసి,యూపీఐ పిన్ తో ట్రాన్సాక్షన్ పూర్తి చేయవచ్చు.
  • ఒక వేళ మీరు డబ్బులు పంపే వ్యక్తి వాట్సాప్ పే ను ఉపయోగించకపోతే వాట్సాప్ పే క్యూఆర్ కోడ్, యూపీఐ అడ్రస్ ద్వారా కూడా డబ్బులను పంపించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి