ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో ఉన్నట్టే..ప్రత్యేకతలు ఏంటంటే..

విల్లు ఆకారంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణం ఉంటుంది. భూకంపాలను, బలమైన గాలులను తట్టుకునేలా ఈ బ్రిడ్జి నిర్మాణం చేసినట్టుగా అధికారులు వివరించారు. 2004లో తలపెట్టిన ఈ ప్రాజెక్టు ఎన్నో అవాంతరాలను దాటుకుని ఎట్టకేలకు నిర్మాణం పూర్తి చేసుకుంది. ఈ బ్రిడ్జి ద్వారా సరుకు రవాణాకు ప్రస్తుతం కశ్మీర్ నుంచి ఢిల్లీకి 20 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ బ్రిడ్జి ఆర్చ్ మొత్తం బరువు 10,619 మెట్రిక్ టన్నులు.

ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో ఉన్నట్టే..ప్రత్యేకతలు ఏంటంటే..
Chenab Bridge
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 07, 2025 | 9:01 AM

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైలు వంతెన త్వరలోనే ప్రయాణానికి అందుబాటులోకి రానుంది. ఈ రైలులో ప్రయాణించడం అంటే విమానంలో మేఘాల గుండా ప్రయాణించినట్లే. మీరు ఈ రైలులో వెళ్తుంటే.. స్వర్గంలో విహరిస్తున్న అద్భుతమైన అనుభూతిని పొందుతారు. ఎందుకంటే, ఇది భారత్‌లో గల ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతన..ఇప్పుడు ప్రయాణానికి సిద్ధంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సింగిల్ ఆర్చ్ రైలు వంతెనగా గుర్తింపుతో, కాశ్మీర్ లోయను భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానించడానికి ఈ వంతెన సిద్ధంగా ఉంది. అంతేకాదు.. కాశ్మీర్ లోయను రైలు మార్గం ద్వారా అనుసంధానించడం భారతీయ రైల్వే చరిత్రలో ఇదే తొలిసారి.

చీనాబ్ నదిపై ఈ రైలు వంతెనను పూర్తి చేయడానికి సుమారు 22 సంవత్సరాలు పట్టింది. వంతెన నిర్మాణం 2003లో ప్రారంభమైంది. ఇది 2025 నాటికి నిర్మాణం పూర్తైంది. ఈ వంతెన పొడవు 1,315 మీటర్లు. జమ్మూ నుండి కాశ్మీర్ వరకు 271 కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్‌పై నిర్మించబడింది. భారతీయ రైల్వే చరిత్రలో కాశ్మీర్ లోయ రైలు ద్వారా అనుసంధానం కావడం ఇదే తొలిసారి. చీనాబ్ వంతెన ఇంజినీరింగ్‌కు అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుంది. అయితే దీన్ని నిర్మించడం కూడా అంతే కష్టంతో కూడిన పని. నిర్మాణ పనులు చాలాసార్లు నిలిపివేయవలసి వచ్చిందని సంబంధిత అధికారులు వెల్లడించారు.. ఎందుకంటే ఇది ఎత్తైన ప్రదేశంలో ఉండటం, గంటకు 266 కిమీ వేగంతో గాలులు వీస్తుంటాయి.. దాంతో వంతెన నిర్మాణానికి పదేపదే ఆటంకం కలిగిందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ప్రపంచంలోనే ఎత్తైన సింగిల్ ఆర్చ్ రైలు వంతెన కాశ్మీర్‌ను భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు కలుపుతుంది. కాశ్మీర్‌ను కలిపే చీనాబ్ వంతెన పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే ఎత్తైనది. ఈఫిల్ టవర్ ఎత్తు 330 మీటర్లు, చీనాబ్ వంతెన ఎత్తు 359 మీటర్లు. వంతెన మధ్య భాగం 467 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ వంతెనలో మొత్తం 17 పిల్లర్లను ఏర్పాటు చేశారని సమాచారం. ఈ బ్రిడ్జి ద్వారా రైలు గంటకు 100 కి.మీ వేగంతో ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్లేందుకు వీలుందని చెప్పారు. ఈ బ్రిడ్జి మీదుగా రైళ్లు వెళ్లినప్పుడు మేఘాల మధ్య వెళుతున్నట్లుగా అనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిపై ప్రయాణం చేయడంలోని థ్రిల్ అద్భుతం అంటున్నారు.

సుమారు రూ. 1486కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టారు. ఉదంపుర్ – శ్రీనగర్ – బారాముల్లా మార్గంలో వంతెన నిర్మాణం జరిగింది. కాశ్మీర్ లోయ కనెక్టవిటీని పెంచడమే ఈ వంతెన నిర్మాణం లక్ష్యం. విల్లు ఆకారంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణం ఉంటుంది. భూకంపాలను, బలమైన గాలులను తట్టుకునేలా ఈ బ్రిడ్జి నిర్మాణం చేసినట్టుగా అధికారులు వివరించారు. 2004లో తలపెట్టిన ఈ ప్రాజెక్టు ఎన్నో అవాంతరాలను దాటుకుని ఎట్టకేలకు నిర్మాణం పూర్తి చేసుకుంది. ఈ బ్రిడ్జి ద్వారా సరుకు రవాణాకు ప్రస్తుతం కశ్మీర్ నుంచి ఢిల్లీకి 20 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ బ్రిడ్జి ఆర్చ్ మొత్తం బరువు 10,619 మెట్రిక్ టన్నులు.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిపై హిమాలయాలు, మంచుతో కప్పబడిన పర్వతాల గుండా తొలిసారిగా రైలు నడుస్తుంది. గత శనివారం(జనవరి4న) కత్రా బనిహాల్ రైల్వే విభాగం తన మొట్టమొదటి రైలు టెస్ట్‌ట్రయల్‌ని విజయవంతంగా పూర్తి చేసింది. తద్వారా ఢిల్లీ నుండి శ్రీనగర్ అంటే కాశ్మీర్ వరకు రైలులో ప్రయాణించడం సాధ్యమైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..