ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌ను తీర్చిదిద్దుతాం

దేశంలో మైక్రోసాఫ్ట్ విస్తరణ, పెట్టుబడి ప్రణాళికలపై ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం భేటి అయ్యారు ఆ కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల. ఈ సమావేశంపై తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు ప్రధాని మోదీ. 'సత్య నాదెళ్ల.! మిమ్మల్ని కలవడం నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది.

ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌ను తీర్చిదిద్దుతాం
Pm Modi & Satya Nadella
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 07, 2025 | 11:11 AM

దేశంలో మైక్రోసాఫ్ట్ విస్తరణ, పెట్టుబడి ప్రణాళికలపై ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం భేటి అయ్యారు ఆ కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల. ఈ సమావేశంపై తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు ప్రధాని మోదీ. ‘సత్య నాదెళ్ల.! మిమ్మల్ని కలవడం నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది. భారతదేశంలో మైక్రోసాఫ్ట్ విస్తరణ, పెట్టుబడి ప్రణాళికల గురించి తెలుసుకోవడం జరిగింది. సాంకేతికత, ఆవిష్కరణలు, AIకి సంబంధించి వివిధ అంశాలను చర్చించడం కూడా అద్భుతంగా ఉంది’. అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మూడు రోజుల భారత పర్యటనలో ఉన్న సత్య నాదెళ్ల.. సమావేశం అనంతరం ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘భారతదేశాన్ని AI రంగంలో అగ్రస్థానంలో ఉంచడమే కాకుండా.. ఈ AI ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రతి భారతీయుడికి ప్రయోజనం చేకూరేలా.. దేశంలో మా నిరంతర విస్తరణలో మీరు కలిసి పని చేయడం మాకు ఎంతగానో సంతోషాన్ని ఇచ్చింది” అని సత్య నాదెళ్ల అన్నారు. బెంగళూరు, ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌పై పలు అనుమానాలుపై క్లయింట్స్, ఇతర వాటాదారులను ఉద్దేశించి ప్రశంగించనున్నారు సత్య నాదెళ్ల. నాదెళ్ల చివరిసారిగా ఫిబ్రవరి 2024లో భారతదేశంలో సందర్శించారు. ఈ పెట్టుబడి ద్వారా మైక్రోసాఫ్ట్ 2025 నాటికి భారతదేశంలో 2 మిలియన్ల మందికి AI నైపుణ్య అవకాశాలను అందించడానికి దోహదపడుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి