AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB Railway Jobs: టెట్‌ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తీపికబురు చెప్పింది. దేశంలోని వివిధ రీజియన్లలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏతోపాటు టెట్‌లో ఉత్తీర్ణత పొందిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్ధులు నేటి నుంచి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు,,

RRB Railway Jobs: టెట్‌ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం
RRB Railway Jobs
Srilakshmi C
|

Updated on: Jan 07, 2025 | 11:04 AM

Share

నిరుద్యోగార్థులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB).. దేశంలోని వివిధ రీజియన్లలో గ్రాడ్యుయేట్ టీచర్లు, సైంటిఫిక్ సూపర్‌వైజర్, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్లు, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, లైబ్రేరియన్, ప్రైమరీ రైల్వే టీచర్, అసిస్టెంట్ టీచర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 6వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1036 పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు ఇవే..

  • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల సంఖ్య : 187
  • సైంటిఫిక్ సూపర్‌వైజర్ పోస్టుల సంఖ్య: 03
  • ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్లు పోస్టుల సంఖ్య: 338
  • చీఫ్ లా అసిస్టెంట్‌ పోస్టుల సంఖ్య: 54
  • పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల సంఖ్య: 20
  • ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల సంఖ్య: 18
  • సైంటిఫిక్‌ అసిస్టెంట్‌/ ట్రైనింగ్‌ పోస్టుల సంఖ్య: 02
  • జూనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టుల సంఖ్య: 130
  • సీనియర్‌ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల సంఖ్య: 03
  • స్టాఫ్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల సంఖ్య: 59
  • మ్యూజిక్‌ టీచర్‌ పోస్టుల సంఖ్య: 10
  • ప్రైమరీ రైల్వే టీచర్‌ పోస్టుల సంఖ్య: 03
  • లైబ్రేరియన్ పోస్టుల సంఖ్య: 188
  • అసిస్టెంట్ టీచర్ పోస్టుల సంఖ్య: 02
  • ల్యాబొరేటరీ అసిస్టెంట్‌/ స్కూల్‌ పోస్టుల సంఖ్య: 07
  • ల్యాబ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-3 పోస్టుల సంఖ్య: 12

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏతోపాటు టెట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 01, 2025 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 6, 2025వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/ ఈబీసీ/ మైనారిటీ అభ్యర్థులు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ టెస్ట్‌, టీచింగ్‌ స్కిల్ టెస్ట్‌, ట్రాన్స్‌లేషన్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభ తేదీ: జనవరి 7, 2025.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 6, 2025 రాత్రి 11.59 గంటల వరకు
  • ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: ఫిబ్రవరి 8, 2025.
  • దరఖాస్తు సవరణకు అనుమతి ఇచ్చే తేదీలు: ఫిబ్రవరి 2 నుంచి 18 వరకు

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
బాబీతో చేస్తోన్న మెగా 158 మూవీ టైటిల్ చెప్పేసిన చిరంజీవి..వీడియో
బాబీతో చేస్తోన్న మెగా 158 మూవీ టైటిల్ చెప్పేసిన చిరంజీవి..వీడియో
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..
జెండా లేని జెన్‌జీ.. లాఠీలకు లొంగని తెగింపు..
జెండా లేని జెన్‌జీ.. లాఠీలకు లొంగని తెగింపు..
మార్కెట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ స్పెషల్ ఎడిషన్.. వివరాలివే
మార్కెట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ స్పెషల్ ఎడిషన్.. వివరాలివే
ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష తింటే.. నిజంగా అంత మంచిదా?
ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష తింటే.. నిజంగా అంత మంచిదా?
ఇది మీకు తెలుసా.. సిమ్ కార్డ్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..?
ఇది మీకు తెలుసా.. సిమ్ కార్డ్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..?
రోజూ చెత్త వేస్తున్నా డస్ట్‌బిన్‌ నుంచి వాసన రాకుండా ఉండాలంటే?..
రోజూ చెత్త వేస్తున్నా డస్ట్‌బిన్‌ నుంచి వాసన రాకుండా ఉండాలంటే?..
మార్కెట్లో పెరిగిన 160cc బైక్స్ పోటీ.. టీవీఎస్‌ నిర్ణయమిదే
మార్కెట్లో పెరిగిన 160cc బైక్స్ పోటీ.. టీవీఎస్‌ నిర్ణయమిదే
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.9,800 పెరిగిన బంగారం ధర..
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.9,800 పెరిగిన బంగారం ధర..
వీళ్లు జామకాయలు అస్సలు తినకూడదు..చాలా డేంజర్! శరీరంలో జరిగేది ఇదే
వీళ్లు జామకాయలు అస్సలు తినకూడదు..చాలా డేంజర్! శరీరంలో జరిగేది ఇదే