Brushing scam: వెలుగులోకి నయా స్కామ్.. ఆర్డర్ చేయకుండా ఇంటికి వస్తువు వస్తే ఇక అంతే..!

మీరు ఆన్ లైన్ లో ఎలాంటి ఆర్డర్ చేయకుండానే ఇంటికి పార్సిల్ వచ్చిందా. దానిలో రోల్డ్ గోల్డ్ ఆభరణాలు, గాడ్జెట్లు వంటి చౌక వస్తువులు ఉన్నాయా. అయితే జాగ్రత్తగా ఉండండి. అది స్కామర్లు పంపిన పార్సిల్ కావచ్చు. వాటిని తీసుకోవడం వల్ల వ్యక్తిగతంగా ఎలాంటి నష్టం జరగదు. కానీ మీ పేరును ఉపయోగించి మరో ఖాతాదారుడికి నష్టం కలిగించడానికి స్కామర్లు ప్రయత్నిస్తారు.

Brushing scam: వెలుగులోకి నయా స్కామ్.. ఆర్డర్ చేయకుండా ఇంటికి వస్తువు వస్తే ఇక అంతే..!
Follow us
Srinu

|

Updated on: Jan 07, 2025 | 4:45 PM

బ్రషింగ్ స్కామ్ అని పిలిచే ఈ మోసాన్ని అమెజాన్, అలీ ఎక్స్ ప్రెస్ వంటి ఆన్ లైన్ షాపింగ్ సైట్లలో కొందరు స్కామర్లు చేస్తున్నట్టు గుర్తించారు. ఖాతాదారుల నమ్మకాన్ని ఎర చూపి ఈ మోసానికి పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఆన్ లైన్ మార్కెట్ బాగా విస్తరించింది. వివిధ ఇ-కామర్స్ సైట్లలో షాపింగ్ చేయడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. నిత్య జీవితంలో ఉపయోగపడే అనేక వస్తువులు వీటిలో లభిస్తున్నాయి. వందల కొద్దీ ఉండే వస్తువులలో నచ్చిన దాన్ని కొనుగోలు చేయవచ్చు. మనం ఎంచుకున్న వస్తువు ఇంటి గుమ్మం ముగింటకే వచ్చి అందిస్తున్నారు. దీంతో ఇ-కామర్స్ మార్కెట్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.

సాధారణంగా ఇ-కామర్స్ సైట్ లో ఒక వస్తువును కొనుగోలు చేయాలనుకున్నప్పుడు దాని మీద వచ్చిన సమీక్ష (రివ్యూ)లను చదువుతాం. మనకన్నా ముందు ఆ వస్తువును కొనుగోలు చేసిన వారు వాటిని రాస్తారు. సమీక్షలో ఆ వస్తువు నాణ్యత, మన్నిక గురించి మంచిగా చెబుతే వెంటనే కొనుగోలు చేస్తాం. ఈ నమ్మకాన్ని స్కామర్లు తమ వ్యాపారానికి పెట్టుబడిగా మలుచుకుంటున్నారు. బ్రషింగ్ స్కామ్ గా పిలిచే ఈ మోసం ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీనిలో భాగంగా స్కామర్లు ఇ-కామర్స్ ప్లాట్ ఫాంలలో నకిలీ ఖాతాలను రూపొందిస్తారు. కొందరి చిరునామా, ఫోన్ నంబర్లు తదితర వాటిని సేకరించి పెట్టుకుంటారు. వాటిని ఉపయోగించి వారి సొంత ఉత్పత్తుల కోసం ఆర్డర్లు చేస్తారు. తమ నాసిరకం ఉత్పత్తులు, నాణ్యత లేని ఎలక్ట్రానిక్ పరికరాలను గతంలో సేకరించిన చిరునామాలకు పంపిస్తారు. నిబంధనల ప్రకారం.. ఇ-కామర్స్ సంస్థ నుంచి ఆయా చిరునామాలకు వస్తువులు డెలివరీ అవుతాయి.

అనంతరం స్కామర్లు తమ అసలు పని మొదలు పెడతారు. డెలివరీ తీసుకున్న వ్యక్తి పేరు మీద సమీక్షలు రాస్తారు. తమ నాసిరకం ఉత్పత్తుల గురించి గొప్పగా ప్రచారం చేస్తారు. ఆ సైట్ వస్తువుల గురించి వెతుకుతున్న కస్టమర్లు ఇలాంటి స్కామర్ల రివ్యూలను చదువుతారు. వాటిలో వస్తువుల నాణ్యత బాగుందని కితాబు ఇవ్వడంతో వాటిని కొనుగోలు చేస్తారు. బ్రషింగ్ స్కామ్ అనే పధం చైనీస్ ఇ-కామర్స్ నుంచి ఉద్భవించింది. దీని ద్వారా స్కామర్లు నకిలీ ఆర్డర్లు చేసి, తమ వస్తువులను మార్కెటింగ్ చేస్తారు. అతి చవకగా దొరికే వాటిని కొందరు వినియోగదారులకు పంపుతారు. అనంతరం వారి పేరును ఉపయోగించి, చాాలా మందిని మోసం చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి