07 January 2025

విజయ్ దళపతి సినిమా వల్ల డిప్రెషన్‏లోకి వెళ్లాను.. మీనాక్షి చౌదరి..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.

గతేడాది అరడజను సినిమాలతో అలరించిన ఈ అమ్మడు ప్రస్తుతం వెంకటేశ్ సరసన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో నటిస్తుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి.. విజయ్ దళపతి నటించిన ది గోట్ మూవీ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ది గోట్ సినిమా తర్వాత తనపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయని.. అవి చూసి ఎంతో బాధపడ్డానని.. దాంతో డిప్రెషన్‏లోకి వెళ్లానని చెప్పుకొచ్చింది.

కానీ లక్కీ భాస్కర్ సినిమాతో తనకు మంచి ప్రశంసలు వచ్చాయని.. ఇప్పటి నుంచి మంచి సినిమాలు చేయడంపైనే దృష్టి పెట్టినట్లు తెలిపింది. 

వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్). ఇందులో విజయ్ దళపతి హీరోగా నటించారు.

ఈ సినిమాలో మీనాక్షి పాత్రకు ఎక్కువ స్పేస్ లేదు. తొలిరోజే ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అంతగా కలెక్షన్స్ సైతం రాబట్టలేకపోయింది.

రూ.455 కోట్లు రాబట్టిన ఈ సినిమా 2024లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. కానీ మీనాక్షిపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయట.