ఎన్ని జన్మల ఫలమో అందం ఈమెలో ఐక్యమైంది.. మెస్మరైజ్ సప్తమి.. 

07 January 2025

Battula Prudvi

Credit: Instagram

8 జూన్ 1996న కర్ణాటక రాజధాని బెంగుళూరులో జన్మించింది వయ్యారి భామ సప్తమి గౌడ. ఆమె తండ్రి S. K. ఉమేష్ గౌడ్ రిటైర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్. తల్లి పేరు శాంత గౌడ.

ఓ ప్రముఖ కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్‎లో సివిల్ ఇంజనీరింగ్‎ డిగ్రీ పట్టా పొందింది ఈ బ్యూటీ.

చదువుకొనే రోజుల్లో స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొని అనేక పతకాలు సాధించింది. కన్నడ భాషలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‎గా ఉంది.

కన్నడ డివైన్ బ్లాక్ బస్టర్ చిత్రం కాంతార సినిమాలో రిషబ్ శెట్టి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది. అలాగే ఈ సినిమాలో తన అందంతోనూ కవ్వించింది ఈ ముద్దుగుమ్మ.

కాంతార సినిమా తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం ది వ్యాక్సిన్ వార్ లో కూడా నటించింది.

ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. దాంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ పెరిగాయి. తర్వాత యువ అనే సినిమాలో కనిపించింది.

కర్ణాటకలోని వయసులో ఉన్న అమ్మాయిలకు మెన్‌స్ట్రువల్ కప్పుల పంపిణీని కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన "నాన్న మైత్రి" పథకానికి అంబాసిడర్‌గా ఉంది.