AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanathara : మరోసారి చిక్కుల్లో నయనతార.. చంద్రముఖి సినిమా నిర్మాతల నోటీసులు.. అసలు విషయం ఇదే..

ఇటీవల లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు ఎక్కువగా వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం తమిళ నటుడు ధనుష్ గురించి తన ఇన్ స్టాలో సుధీర్ఘ లేఖ పోస్ట్ చేయడంతో నయన్ పేరు మారుమోగింది. దీంతో వీరిద్దరి మధ్య కొన్నాళ్లుగా ఉన్న కోల్డ్ వార్ గురించి తెలిసి అందరూ షాకయ్యారు.

Nayanathara : మరోసారి చిక్కుల్లో నయనతార.. చంద్రముఖి సినిమా నిర్మాతల నోటీసులు.. అసలు విషయం ఇదే..
Nayanthara
Rajitha Chanti
|

Updated on: Jan 07, 2025 | 1:40 PM

Share

లేడీ సూపర్ స్టార్ నయనతార కొద్ది రోజుల క్రితం హీరో ధనుష్ గురించి సుధీర్ఘ లేఖ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ధనుష్ ప్రవర్తనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ధనుష్ నిర్మించిన నానుమ్ రౌడీ సినిమా నుంచి ఓ క్లిప్ తన డాక్యుమెంటరీ కోసం ఉపయోగించినందుకు ఆ హీరో కాపీరైట్స్ నోటీసులు పంపించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన అనుమతి లేకుండా క్లిప్ ఉపయోగించినందుకు రూ.10 కోట్లు చెల్లించాలని ధనుష్ నోటీసులు పంపించడాన్ని ప్రశ్నిస్తూ నెట్టింట విమర్శలు గుప్పించింది. ధనుష్ ప్రవర్తన గురించి తీవ్రంగా నెగిటివ్ కామెంట్స్ చేయడంతో నయనతారపై ధనుష్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో ఆమె తీరును ఖండించారు. ఈ క్రమంలోనే తాజాగా నయనతార మరోసారి చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. నయనతారకు చంద్రముఖి మూవీ మేకర్స్ నోటీసులు పంపినట్లు ఓ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలపై చంద్రముఖి మూవీ నిర్మాతలు రియాక్ట్ అయ్యారు. నయనతారకు తాము ఎలాంటి నోటీసులు పంపలేదని స్పష్టం చేశారు. తాము రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వస్తోన్న వార్తలలో ఎలాంటి నిజం లేదన్నారు. నయనతార తన డాక్యుమెంటరీ కోసం ముందే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. “నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ తెరకెక్కించే ముందే రౌడీ పిక్చర్స్ సంస్థ మా వద్ద నో అబక్షన్ సర్టిఫికెట్ తీసుకుంది. డాక్యుమెంటరీలో చంద్రముఖి సినిమాలోని సన్నివేశాలను ఉపయోగించడంపై మేము ఎలాంటి నోటీసులు పంపలేదు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు” చంద్రముఖి నిర్మాణ సంస్థ శివాజీ ప్రొడక్షన్స్ పేర్కొంది.

మరోవైపు ఈ విషయంపై నయనతార టీం స్పందించింది. చంద్రముఖి సినిమా నిర్మాతలు తమకు నోటీసులు పంపినట్లు వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని.. చంద్రముఖి మూవీ సీన్స్ వాడుకోవడానికి సదరు నిర్మాణ సంస్థకు తమకు ముందుగానే ఎన్ఓసీ ఇచ్చిందని నయన్ టీం పేర్కొంది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు