Daaku Maharaaj: బాలయ్య సినిమా కోసం హాట్ బ్యూటీ భారీ రెమ్యునరేషన్.. ఊర్వశి ఎన్ని కోట్లు తీసుకుందంటే

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా డాకూ మహరాజ్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రద్ద శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే చాందినీ చౌదరి ఓ కీలక పాత్రలో యాక్ట్ చేసింది. వీరితో పాటు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా ఓ స్పెషల్ సాంగ్ లో బాలయ్యతో కలిసి చిందులేసింది.

Daaku Maharaaj: బాలయ్య సినిమా కోసం హాట్ బ్యూటీ భారీ రెమ్యునరేషన్.. ఊర్వశి ఎన్ని కోట్లు తీసుకుందంటే
Daku Maharaaj
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 07, 2025 | 2:39 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న నయా మూవీ డాకూ మహారాజ్. యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న డాకూ మహారాజ్ థియేటర్స్ లో సందడి చేయనుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు దర్శకుడు బాబీ. ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. డాకూ మహారాజ్ టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీ అందరి దృష్టి ఆకర్షించింది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. అలాగే బాలకృష్ణ సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు.

డాకూ మహారాజ్ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యాజైస్వాల్ లతో పాటు బాలీవుడ్ అందాల భామ ఊర్వశి రౌతేలా కూడా నటిస్తుంది . ఊర్వశి బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న బ్యూటీ. అలాగే తెలుగులో ఈ చిన్నది స్పెషల్ సాంగ్స్ తో మెప్పించింది. ఇప్పటికే పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఊర్వశి ఈ సినిమాలో కీలక పాత్ర కూడా పోషిస్తుందని తెలుస్తుంది. డాకూ మహారాజ్ సినిమాలో ఊర్వశి రౌతేలా పోలీస్ ఆఫిసర్ గా కనిపించనుందని తెలుస్తుంది.

అలాగే బాలయ్యతో ఓ స్పెషల్ సాంగ్ లోనూ మెరుస్తుంది ఈ అమ్మడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కోసం ఊర్వశి తీసుకున్న రెమ్యునరేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది ఊర్వశి, చిరంజీకి హీరోగా నటించిన ఈ సినిమాలో బాస్ పార్టీ సాంగ్ లో మెగాస్టార్ తో కలిసి స్టెప్పులేసింది ఈ అమ్మడు. ఇప్పుడు ఉర్వశికి తన సినిమాలో నటించే ఛాన్స్ కూడా ఇచ్చాడు బాబీ. కాగా బాలయ్య బాబు సినిమాలో నటించినందుకు ఊర్వశి  ఏకంగా రెండున్నర కోట్లు రూపాయిలు రెమ్యునరేషన్ అందుకుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. అయితే ఆమె పాత్ర పరిధి తక్కువగా ఉంటుందని అంటున్నారు. అలాగే దబిడి దిబిడి సాంగ్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ టిప్స్‎తో మీ కుంభమేళా జర్నీ సేఫ్ అండ్​ హ్యాపీ​!
ఈ టిప్స్‎తో మీ కుంభమేళా జర్నీ సేఫ్ అండ్​ హ్యాపీ​!
అమ్మకాల్లో జనఔషధి అవుట్‌లెట్‌ల రికార్డు..!
అమ్మకాల్లో జనఔషధి అవుట్‌లెట్‌ల రికార్డు..!
ఈ గ్రామంలో ఎవరికీ పేర్లు లేవు.. ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారంటే
ఈ గ్రామంలో ఎవరికీ పేర్లు లేవు.. ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారంటే
పోస్టాఫీసు ఖాతాదారులే వారి టార్గెట్.. అకౌంట్లు బ్లాక్‌..!
పోస్టాఫీసు ఖాతాదారులే వారి టార్గెట్.. అకౌంట్లు బ్లాక్‌..!
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ డ్రింక్స్‌కు గుడ్‌బై చెప్పండి
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ డ్రింక్స్‌కు గుడ్‌బై చెప్పండి
గేమ్ ఛేంజర్‌కు నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు.. ఫ్యాన్స్ ఊరుకుంటారా..
గేమ్ ఛేంజర్‌కు నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు.. ఫ్యాన్స్ ఊరుకుంటారా..
మీరూ రాత్రిళ్లు స్వెటర్లు, సాక్స్‌ ధరించి నిద్రపోతున్నారా?
మీరూ రాత్రిళ్లు స్వెటర్లు, సాక్స్‌ ధరించి నిద్రపోతున్నారా?
ప్రయాగ్‌రాజ్‌లో మొదలైన సందడి స్పెషల్ ఎట్రాక్షన్గా బాబాలు, సాధువుల
ప్రయాగ్‌రాజ్‌లో మొదలైన సందడి స్పెషల్ ఎట్రాక్షన్గా బాబాలు, సాధువుల
థర్డ్‌ పార్టీ యాప్‌ లేకుండా వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్ల స్కాన్!
థర్డ్‌ పార్టీ యాప్‌ లేకుండా వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్ల స్కాన్!
నాకు పెళ్లైంది.. కానీ నెలకు వారం రోజులు మాత్రమే
నాకు పెళ్లైంది.. కానీ నెలకు వారం రోజులు మాత్రమే